iDreamPost
android-app
ios-app

Bollywood: 19 ఏళ్లకే ‘దంగల్’ నటి కన్నుమూత!

  • Published Feb 17, 2024 | 4:26 PM Updated Updated Feb 18, 2024 | 1:42 PM

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు చిన్న వయసులోనే చనిపోయిన వాళ్లు ఉన్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాలో నటి కూడా తుదిశ్వాస విడిచారు.

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు చిన్న వయసులోనే చనిపోయిన వాళ్లు ఉన్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాలో నటి కూడా తుదిశ్వాస విడిచారు.

  • Published Feb 17, 2024 | 4:26 PMUpdated Feb 18, 2024 | 1:42 PM
Bollywood: 19 ఏళ్లకే ‘దంగల్’ నటి కన్నుమూత!

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు చిన్న వయసులోనే చనిపోయిన వాళ్లు ఉన్నారు. వీరిలో చాలామంది వెండితెర పై మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అయితే మరణం ఎప్పుడు, ఎవరికి ఎలా వస్తుందనేది ఎవరు ఊహించలేము. ఎందుకంటే.. చాలామంది అనారోగ్యంకి గురయ్యి చనిపోతే, మరికొందరు ఆత్మహత్య చేసుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అయితే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ప్రమాదవశాత్తు హఠాత్తుగా చనిపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా స్టార్ హీరో సినిమాలో బాల నటిగా నటించిన ఓ అమ్మాయి కూడా 19 ఏళ్లకే తనువు చలించింది. సిని పరిశ్రమలో తన ఆద్భుతమైన నటనతో కనుబరిచిన ఆ అమ్మాయి ఈ ప్రపంచానికే వీడ్కోలు పలికింది. ఇంతకి ఆమె ఎవరంటే..

బాలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ హీరో అమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాలో నటించిన బాలా నటి సుహాని భట్నాగర్ తాజాగా కన్నుముశారు. ఈ వార్త సిని పరిశ్రమలో అందరినీ కలిచివేసింది. అయితే నటి సుహాని కేవలం 19 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఎందుకంటే.. సుహాని గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ అనారోగ్యం కారణంగా సుహని ఈరోజు అనగా ఫిబ్రవరి 1న 2024న మరణించారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే సుహాని దంగల్ సినిమాలో బబితా ఫొగట్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ, ఇంత చిన్న వయసులోనే తన నటనకు, ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈమె మరణించిందనే వార్త ఎవరు నమ్మలేకపోతున్నారు. కాగా, సుహాని మరణం వెనుక కారణం ఆమె శరీరం మొత్తం నీరు పట్టడం అని సమాచారం అందింది. ఈమెకు కొంతకాలం క్రితం యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె కాలు ఫ్రాక్చర్ కావడంతో.. చికిత్స సమయంలో తీసుకున్న మందులకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని తెలుస్తోంది. వాటి కారణంగానే ఆమె శరీరంలో నీరు పేరుకుపోయింది. దీంతో సుహానీ చాలాకాలం నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. అలా చికిత్స పొందుతున్న సుహాని ఈరోజు తుది శ్వాస విడిచింది. ఇక ఈ రోజు సుహాని అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం అందింది.

ఇక సుహానికి దంగల్ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు అందుకుంది. ఇదే కాకుండా.. ఈమె అనేక టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో కూడా అలరించింది. కాగా, దంగల్ సినిమా తర్వాత సుహానికి వరుస ఆఫర్లు వచ్చినా నటనకు విరామం ఇచ్చి చదువు పైదృష్టి పెట్టాలనుకుంది. ఈ క్రమంలోనే సుహాని తన చదువు పూర్తి చేసిన తర్వాత, సిని పరిశ్రమకు వస్తానని పలు ఇంటర్వ్యూలో వెల్లడించింది. కానీ, ఇలా అర్ధంతరంగా ఆమె కోరిక మిగిలిపోవడం నిజంగా చాలా బాధకరం. మరి, అతి చిన్న వయసులోనే మరణించిన నటి సుహాని పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

marsbahis girişjojobetjojobet giriş