iDreamPost
android-app
ios-app

పట్టాలెక్కనున్న రానా డ్రీమ్ ప్రాజెక్ట్! ఆ డైరెక్టర్ ప్లేస్ లో త్రివిక్రమ్!

  • Author ajaykrishna Published - 08:33 AM, Thu - 20 July 23
  • Author ajaykrishna Published - 08:33 AM, Thu - 20 July 23
పట్టాలెక్కనున్న రానా డ్రీమ్ ప్రాజెక్ట్! ఆ డైరెక్టర్ ప్లేస్ లో త్రివిక్రమ్!

ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకు కొన్ని కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. కెరీర్ ఆరంభంలో వాటి సంగతి పక్కన పెట్టేసినా.. ఓ రేంజ్ స్టార్డమ్, ఫేమ్ వచ్చాక వారి డ్రీమ్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు ఇదే బాటలో చేరేందుకు రెడీ అయిపోయాడు టాల్ హీరో దగ్గుబాటి రానా. కొన్నేళ్ల క్రితమే రానా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘హిరణ్య కశిప’ అని చెప్పేశాడు. ఆ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కిస్తారని.. అప్పట్లోనే అనౌన్స్ మెంట్ సైతం జరిగింది. కానీ.. ఆ తర్వాత ఆయన సమంతతో శాకుంతలం రూపొందించారు. దీంతో శాకుంతలం తర్వాత ఈ ప్రాజెక్ట్ ఉంటుందని అనుకున్నారు. కానీ ఎలాంటి అప్డేట్ లేదు.

ఈ క్రమంలో హిరణ్య కశిప ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ దగ్గరే ఆగిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఈ హిరణ్య కశిప మూవీ ఉన్నట్లా లేనట్లా? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఎందుకంటే ఓవైపు గుణశేఖర్ ఎంతో కష్టపడి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన శాకుంతలం బాక్సాఫీస్ వద్ద ఊహించని పరాజయాన్ని చవిచూసింది. దీంతో అంతా హిరణ్య కశిప అటకెక్కినట్టే అనుకున్నారు. కానీ, తాజాగా హిరణ్య కశిప మూవీని పట్టాలెక్కించబోతున్నట్లు రానా అధికారికంగా ప్రకటించాడు. ఈరోజు అమెరికాలో శాన్ డియాగో కామిక్ కాన్ వేడుకలు గ్రాండ్ గా ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ ఈవెంట్ లో రానా.. స్పిరిట్ మీడియాతో కలిసి నిర్మిస్తున్న కొన్ని సినిమాలను, పోస్టర్లతో సహా అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశాడు. అందులో ఒకటి హిరణ్యకశిప. అమర చిత్ర కథ కామిక్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోకి డైరెక్టర్ త్రివిక్రమ్ ఎంటర్ అయినట్లు తెలిపాడు రానా. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్టోరీ అందిస్తున్నట్లు తెలుస్తుంది. గుణశేఖర్ కాకుండా త్రివిక్రమ్ పేరు కొత్తగా ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యేసరికి హిరణ్య కశిప మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. మరి డైరెక్టర్ గా గుణశేఖర్ ఉంటారా లేక స్టోరీతో పాటు అన్ని బాధ్యతలు త్రివిక్రమ్ తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. హిరణ్యకశిప కామిక్ పోస్టర్ నెట్టింట విశేషంగా ఆకట్టుకొంటుంది. మరి రానా హిరణ్య కశిప మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetewin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom