iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

  • Published Sep 18, 2024 | 11:43 AM Updated Updated Sep 21, 2024 | 3:24 PM

CID Sakunthala passed away: సీనీ పరిశ్రమకు చెందిన నటీనటులు వరుసగా కన్నుమూయడంతో అటు వారి కుటుంబ సభ్యులు, ఇటు వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

CID Sakunthala passed away: సీనీ పరిశ్రమకు చెందిన నటీనటులు వరుసగా కన్నుమూయడంతో అటు వారి కుటుంబ సభ్యులు, ఇటు వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలతో పాటు వివిధ రంగాలకు చెందిన వారు వరుసగా కన్నుమూస్తున్నారు. చాలా వరకు హార్ట్ ఎటాక్, వయోభారం, ఇతర అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. ఇటీవల ఆదిపురుష్ నటి ఆశా వర్మ, నటుడు నిర్మల్ బెన్నీ, తమిళ స్టార్ కమెడియన్ బిజిలి రమేష్, బాలీవుడ్ నటుడు వికాస్ సేథీ, కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఢిల్లీ బాబు మరణాలు మరువక ముందే ప్రముఖ నటి కన్నుమూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి CID శకుంతల (84) కన్నుమూశారు. ఆమె అసలు పేరు అరుణాచలం శకుంతల. బెంగుళూరులో ఛాతి నొప్పితో నిన్న హాస్పిటల్ లో చేరారు. ఈక్రమంలోనే ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ ఇండస్ట్రీలో దాదాపు 600 చిత్రాల్లో నటించారు. ఇండస్ట్రీలో కొనసాగుతూనే బుల్లితెరపై పలు సీరియళ్లలో నటించారు. ఎంజీఆర్, శివాజీ గణేషన్ లాంటి అగ్ర హీరోలతో స్కీన్ షేర్ చేసుకున్నారు శకుంతల. తెలుగు లో బుద్దిమంతుడు, నేను మినిషినే వంటి మూవీస్ లో నటించారు.ఆమె నటించిన మొదటి సినిమా ‘సీఐడీ శంకర్’. ఈ మూవీతో ఆమె సీఐడీ శకుంతలగా పాపులర్ అయ్యారు. ఆర్ సుందరం దర్శకత్వంలో వచ్చిన ‘తవపుతల్వన్’ మూవీలో శివాజీ గణేశన్ కి పోటా పోటీగా నటించింది. ఈ మూవీలో ఆమె ప్రతినాయక పాత్ర పోషించి మెప్పించారు.

సీఐడీ శకుంతల స్వస్థలం సేలంలోని అరిసిపాళయం. ఆమె తండ్రి అరుణాచలం తిరువరుంబూరులో ఉద్యోగం చేసేవారు.. శకుంతలకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఈక్రమంలోనే ఆమె లలిత, పద్మిని, రాగిణి హూస్ట్ చేసిన షోలో డ్యాన్స్ నేర్చుకుంది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రల్లో అయినా తన నటనతో మెప్పించింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ప్రత్యేక సాంగ్స్ లో నటించింది. వాంప్, విలన్ పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటి శకుంతల మృతిపై సినీ పరిశ్రకు చెందిన ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.