iDreamPost
android-app
ios-app

దర్శకుడు త్రినాథరావు నక్కిన పై విమర్శలు

  • Published Feb 11, 2024 | 10:44 AM Updated Updated Feb 11, 2024 | 10:44 AM

దర్శకుడు త్రినాథరావు నక్కినపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ హీరోయిన్ గురించి స్టేజీపైనే అలా మాట్లాడడంతో డైరెక్టర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే?

దర్శకుడు త్రినాథరావు నక్కినపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ హీరోయిన్ గురించి స్టేజీపైనే అలా మాట్లాడడంతో డైరెక్టర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే?

  • Published Feb 11, 2024 | 10:44 AMUpdated Feb 11, 2024 | 10:44 AM
దర్శకుడు త్రినాథరావు నక్కిన పై విమర్శలు

‘ధమాకా’, ‘నేను లోకల్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఫేమస్ అయిన దర్శకుడు త్రినాథరావు నక్కిన తన తాజా ప్రాజెక్ట్ చౌర్య పాఠం అనే క్రైమ్ కామెడీతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. కాగా ఈ సినిమా టీజర్ లాంచ్ లో త్రినాథరావు కాస్త సరదాగా, నవ్వులు పంచుదాం అని చేసిన పని ఇప్పుడు ఆయన పై విమర్శలకు కారణం అయింది. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ గురించి ఓ సరదా సంఘటనను షేర్ చేస్తూ ఆ అమ్మాయి తనను తప్ప చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరినీ గట్టిగా కౌగిలించుకునేది అని చెప్పారు.

తాను కౌగిలించుకోవాలని అడిగినప్పుడల్లా, ఆమె సున్నితంగా తిరస్కరించి, దానికి బదులుగా షేక్ హ్యాండ్ లను ఎంచుకునేదని దర్శకుడు త్రినాథరావు నక్కిన చెప్పుకొచ్చారు. ఆయన అలా చెప్పిన సమయంలో స్టేజ్ పైన అందరూ నవ్వారు. నిజానికి ఆయన ఈ విషయాన్ని సరదాగానే అనుకున్నప్పటికీ, ఆ సమయంలో హీరోయిన్ పాయల్ కాస్త అసౌకర్యంగా కనిపించారు. అందరి ముందు అలా ప్రవర్తించటం ఏంటని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. అందరూ త్రినాథరావు నక్కిన పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏ విషయం పై జోక్ చేయాలో ఏ విషయం పై జోక్ చేయకూడదో తెలియదా అని అడుగుతున్నారు.

త్రినాథరావు నక్కిన తన సినిమాల్లో హీరోల మాదిరిగా హుషారుగా ఉంటారు. ఆయన ఎవరినీ నొప్పించాలని అలా మాట్లాడలేదు. హీరోయిన్ తో కాస్త నవ్వించాలని అలా అని ఉండచ్చు. అయితే నేటి సోషల్ మీడియా యుగంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలని కూడా పెద్దగా చూసే ప్రమాదం ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి సంఘటనలను త్వరగా వైరల్ అవుతాయి కాబట్టి అపోహలు, వివాదాలు రాకుండా సినీ పరిశ్రమలోని వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ ఈవెంట్ లలో హీరోయిన్ల గురించి మాట్లాడే మాటల పై కాస్త శ్రద్ధ వహించి ఇటువంటి సున్నిత అంశాలను పరిగణనలోకి తీసుకుని జాగర్త వహిస్తే అందరికీ మంచిది.