iDreamPost
android-app
ios-app

తమ్ముడి విడాకులపై స్పందించిన క్రిష్ణ చైతన్య రెడ్డి… విడాకులు కూడా చాలా పవిత్రమంటూ

  • Published Jan 23, 2024 | 11:07 AM Updated Updated Jan 23, 2024 | 11:07 AM

Crisna Chaitanya Reddy-Brothers Divorce: మోటివేషనల్‌ స్పీకర్‌ వంశీ కృష్ణారెడ్డి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అన్న క్రిష్ణ చైతన్య రెడ్డి.. తమ్ముడి విడాకుల మీద స్పందించాడు. ఆ వివరాలు..

Crisna Chaitanya Reddy-Brothers Divorce: మోటివేషనల్‌ స్పీకర్‌ వంశీ కృష్ణారెడ్డి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అన్న క్రిష్ణ చైతన్య రెడ్డి.. తమ్ముడి విడాకుల మీద స్పందించాడు. ఆ వివరాలు..

  • Published Jan 23, 2024 | 11:07 AMUpdated Jan 23, 2024 | 11:07 AM
తమ్ముడి విడాకులపై స్పందించిన క్రిష్ణ చైతన్య రెడ్డి… విడాకులు కూడా చాలా పవిత్రమంటూ

తెలుగులో మోటివేషన్‌ల స్పీకర్‌ అనగానే.. ముందుగా గుర్తుకు వచ్చే పేరు క్రిష్ణ చైతన్య రెడ్డి. ఆ తర్వాత ఆయన సోదరుడు వంశీ కృష్ణారెడ్డికూడా క్రిష్ణ చైతన్య బాటలోనే నడిచి.. మోటివేషనల్‌ స్పీకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో వంశీకృష్ణా రెడ్డి రెండు సంవత్సరాల క్రితం.. సేంద్రీయ వ్యవసాయం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నేత్రా రెడ్డిని వివాహం చేసుకున్నాడు. అయితే తాజాగా తామిద్దరం విడిపోయినట్లు.. వారు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. విడాకుల తర్వతా తొలిసారి వంశీకృష్ణ రెడ్డి ఐడ్రీమ్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తమ దారులు వేరు అవ్వడం వల్లనే విడిపోతున్నాం తప్ప.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చాడు.

ఇలా ఉండగా.. వంశీకృష్ణారెడ్డి విడాకులపై ఆయన అన్నయ్య క్రిష్ణ చైతన్య రెడ్డి స్పందించారు. ఐడ్రీమ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. క్రిష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నా తమ్ముడిది ప్రేమ పెళ్లి అనే కంటే అరెంజ్డ్‌ మార్యేజ్‌ అని చెప్పవచ్చు. పెళ్లి చూపుల్లో కలిశారు.. మాట్లాడుకున్నారు.. ఆ తర్వాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే 13 రోజుల్లోనే వారు వివాహం చేసుకున్నారు. ఇబ్బంది పడుతూ కలిసి ఉండటం కన్నా.. విడిపోయి.. వాళ్లకి నచ్చిన దారిలో పయనిస్తే తప్పు కాదు కదా. వారిద్దరి దారులు వేరే.. కలిసి ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అవి వర్కౌట్‌ కాలేదు.. అందుకే విడిపోయారు. పెళ్లి ఎంత పవిత్రమో.. కలిసి బతకలేనప్పుడు విడాకులు తీసుకోవడం కూడా అంతే పవిత్రం అని నేనే నమ్ముతాను’’ అని చెప్పుకొచ్చాడు.

‘‘కలిసి ఉన్న సమయంలో వారిద్దరి మధ్య గొడవలు వస్తే నాతో మాట్లాడేవారు.. నేత్ర కూడా మాట్లాడేది. ఆ తర్వాత మళ్లీ కలిసి ఉండేవారు. అలా కొన్ని ప్రయత్నాలు చేశారు. ఇక చివరకు అవేం ఫలించకపోవడంతోనే.. అంత త్వరగా విడాకులు తీసుకున్నారు. ఇక నెగిటివ్‌ కామెంట్స్‌ చేసేవాళ్లు.. నా తమ్ముడికి ఉదయ్‌ కిరణ్‌, సుశాంత్‌ సింగ్‌ లాంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్నారా ఏంటో నాకు అర్థం కాలేదు. డైవర్స్‌ అయిన తర్వాత కుంగిపోయి.. జీవితాన్ని ముగించుకోవాలా.. అసలు వాళ్లేం చెప్పాలనుకుంటున్నారో అర్థం కావడంలేదు. విడాకులు తీసుకున్నందుకు వంశీకి బాధ ఉంది. కానీ దాన్ని తను అందరికి చెప్పడు. తన వల్ల కాదు అనుకున్నప్పుడే బయటకు చెప్తాడు’’ అని చెప్పుకొచ్చాడు క్రిష్ణ చైతన్య రెడ్డి.

‘‘వంశీ​​కి తొందరపాటు ఉంది.. దాని వల్ల తన జీవితంలో చాలా సక్సెస్‌ అయ్యాడు. కానీ బయట నుంచి చూసే వారు మాత్రం.. తన తొందరపాటు తనం లేకపోతే చాలా సక్సెస్‌ అవుతారని చెప్పేవారు. కానీ నాకు అలా అనిపించలేదు. ఎందుకంటే వాడి తొందరపాటుతన వల్ల చాలా విజయం సాధించాడు.. నేను చాలా సార్లు చూశాను. కొన్నిసార్లు.. అంతకంటే దారుణంగా ఫెయిల్‌ అయ్యాడు. తను అలానే ఉంటాడు.. అది తన నేచర్‌. దాని వల్ల సక్సెస్‌ అవుతాడు.. ఫెయిల్‌ అవుతాడు.. కానీ మార్చలేం’’ అని చెప్పుకొచ్చాడు.