iDreamPost
android-app
ios-app

సీరియల్ నటి ఇంట్లో శవమై తేలిన యువకుడు.. ఏమైందంటే.?

  • Published Oct 03, 2024 | 1:37 PM Updated Updated Oct 03, 2024 | 4:22 PM

ఆమెది రంగుల ప్రపంచం. అందులోకి ఎంట్రీ ఇచ్చాడు మదన్. ఇద్దరు కలిసి ఆమె ఇంట్లో ఎంజాయ్ చేేసేవారు. ఏడాది పాటు హాయిగా సాగిపోయింది వీరి రిలేషన్ షిప్. కానీ ఓరోజు ప్రియుడు ప్రియురాలి ఇంట్లో శవమై తేలాడు

ఆమెది రంగుల ప్రపంచం. అందులోకి ఎంట్రీ ఇచ్చాడు మదన్. ఇద్దరు కలిసి ఆమె ఇంట్లో ఎంజాయ్ చేేసేవారు. ఏడాది పాటు హాయిగా సాగిపోయింది వీరి రిలేషన్ షిప్. కానీ ఓరోజు ప్రియుడు ప్రియురాలి ఇంట్లో శవమై తేలాడు

  • Published Oct 03, 2024 | 1:37 PMUpdated Oct 03, 2024 | 4:22 PM
సీరియల్ నటి ఇంట్లో శవమై తేలిన యువకుడు.. ఏమైందంటే.?

బిగ్ స్టార్ కావాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వీణ. అనుకున్నంత ఈజీగా అవకాశాలు రావని అర్థమైంది. దీంతో వచ్చిన అవకాశాలు చేసుకుంటూ పోతుంది. సీరియల్స్ చేస్తూ.. కొన్ని కొన్ని కమర్షియల్ యాడ్స్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు మద్యం అలవాటు అయ్యింది. అలా సాగిపోతున్న వీణ జీవితంలోకి మదన్ ఎంట్రీ అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారి ప్రణయానికి దారి తీసింది. సీరియల్ నటి ప్రేమలో మునిగి తేలాడు ఆ మదనుడు. తరచు మదన్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మనేది. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసేవాళ్లు. కొంత కాలం ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారు. ఇంకా ఎంత కాలం ప్రేమించుకుంటాం.. పెళ్లి చేసుకుని.. నన్ను శాశ్వతంగా నీదాన్ని చేసుకో అంటూ మదన్‌ను వీణ కోరింది. అంతలోనే ప్రియురాలి ఇంట్లో ప్రియుడు శవమై తేలాడు.. ఇంతకు ఏం జరిగిందంటే..?

కన్నడ బుల్లితెరలో ప్రసారమైన జననితో పాటు పలు సీరియల్స్, కమర్షియల్ యాడ్స్‌లో నటించింది వీణ. ఇప్పుడిప్పుడే నటిగా పేరు తెచ్చుకుంటుంది. ఆమెకు మదన్ అనే యువకుడు ఏడాది క్రితం పరిచయం అయ్యాడు. ఈవెంట్ మేనేజ్ మెంట్‌లో డెకరేటర్‌గా పనిచేసేవాడు మదన్. ఈ ఇద్దరి పరిచయం రిలేషన్ షిప్‌కు దారి తీసింది. తరచుగా మదన్‌ను ఇంటికి పిలిచేది. ఇద్దరు మద్యం సేవించి, ఎంజాయ్ చేసేవారు. ప్రేమ వ్యవహారం నాలుగు పువ్వులు, ఆరు కాయల్లా సాగిపోతుంది. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వీణ ప్రవర్తనపై మదన్‌కు అనుమానం కలిగింది. తనతోనే కాదు చాలా మంది అబ్బాయిలతో సాన్నిహిత్యంగా ఉండటాన్ని చూశాడు. దీంతో ఆమె మనకు సెట్ కాదని భావించాడు.

అందులోనూ మద్యం తాగుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే.. తల్లిదండ్రులు ఒప్పుకోరని నటిని లైట్ తీసుకున్నాడు. ఇప్పటి వరకు తనతో రిలేషన్‌లో ఉండి.. శారీరకంగా, మానసికంగా తనను వినియోగించుకుని, పెళ్లి పేరు తీసుకురాగానే ప్రియుడు మొహం చాటేస్తుండటంపై వీణకు అనుమానం వచ్చింది. దీంతో పెళ్లి చేసుకుందాం అంటూ మదన్‌ను పోరు పెడుతోంది వీణ. కానీ మదన్ అంగీకరించడం లేదు. ఈ పెళ్లి విషయంపైనే మదన్ ఇంటికి వెళ్లి బ్లేడుతో చేయి కోసుకుంది నటి. దీంతో మరింత భయపడ్డాడు ప్రియుడు. పెళ్లి చేసుకోవాలంటూ వీణ నుండి వేధింపులు ఎక్కువయ్యాయి అతనికి.

మంగళవారం సాయంత్రం కూడా మదన్‌కు ఫోన్ చేసి తన ఇంటికి ఆహ్వానించింది. అనంతరం రాత్రి వరకు ఇద్దరూ మద్యం సేవించారు. ఇంతలో వీణ పెళ్లి విషయాన్ని తీసుకు వచ్చింది. ఈ విషయంపై ఇద్దరు గొడవ పడ్డారు. తీవ్ర మనస్థాపం చెందిన మదన్ వాష్‌రూమ్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లోని మరో గదిలోకి వెళ్లి చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఎంతసేపటికీ మదన్ రాకపోవడంతో అనుమానం వచ్చి వీణ ఆ గదిలోకి వెళ్లడంతో ఆత్మహత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం అందింది. కాగా, వీణ హింసించడం వల్లే తన కొడుకు చనిపోయాడంటూ మదన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంపై నటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom