iDreamPost
android-app
ios-app

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌కి గోల్డెన్ ఛాన్స్ .. ఏకంగా..!

  • Published Jul 04, 2024 | 5:41 PM Updated Updated Jul 04, 2024 | 5:41 PM

సోషల్ మీడియా పుణ్యమా అని కొంత మంది ఫేమస్ అవుతున్నారు. ఇన్ స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోలతో స్టార్లుగా మారుతున్నారు. ఇప్పుడు మరో స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ నటిగా మారబోతుంది. వస్తూనే గోల్డెన్ ఆఫర్ కొల్లగొట్టింది.

సోషల్ మీడియా పుణ్యమా అని కొంత మంది ఫేమస్ అవుతున్నారు. ఇన్ స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోలతో స్టార్లుగా మారుతున్నారు. ఇప్పుడు మరో స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ నటిగా మారబోతుంది. వస్తూనే గోల్డెన్ ఆఫర్ కొల్లగొట్టింది.

  • Published Jul 04, 2024 | 5:41 PMUpdated Jul 04, 2024 | 5:41 PM
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌కి గోల్డెన్ ఛాన్స్ .. ఏకంగా..!

సోషల్ మీడియాను వినియోగించుకుని ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి ఫేమస్ అయ్యారు. వారిలో ఒకరు నిహారిక ఎన్ఎం. కంటెంట్ క్రియేటర్‌గా ఫేమస్ అయ్యింది. కామెడీ క్రియేట్ చేస్తూ ఫన్ వీడియోలు రూపొందించింది. లొడలొడ వాగుడు కాయలా వాగుతూ..అన్ని భాషలను కలిపి చుట్టేస్తూ ఉంటుంది. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సుమారు 6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్ కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతుంది. ఆమె తర్వలో నటిగా ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రముఖ బ్యానర్‌లో నటించే అవకాశాన్ని కొల్లగొట్టింది. నిహారిక పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు విషెస్ తెలియజేస్తూ గీతా ఆర్ట్స్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.

చెన్నైలో పుట్టిన నిహారిక బెంగళూరులో పెరిగింది. యూఎస్ కాలిఫోర్నియాలోని చాప్ మాన్ యూనివర్శిటీలో ఏంబీఏ చేసింది. థియేటర్ ఆర్ట్స్ మీద చిన్నప్పటి నుండి ఆసక్తి ఉన్న నిహారిక.. యూట్యూబ్, ఇన్ స్టాలో వీడియోలు చేయడం స్టార్ట్ చేసింది. వివిధ అంశాలపై ఫన్నీ వీడియోలు చేసి స్టార్ సెలబ్రిటీగా మారింది. దీంతో ఆమెతో సినిమా, వెబ్ సిరీస్‌లు ప్రమోషన్లను చేసేందుకు ఆసక్తి చూపించారు స్టార్ సెలబ్రిటీలు. అలా మెల్లిగా యాడ్స్ కూడా చేసింది. మహేష్ బాబు, విజయ దేవరకొండ, నాగ చైతన్య, విక్రమ్, యశ్, ప్రియాకం చోప్రా, రణబీర్ కపూర్ సెలబ్రిటీలతో కలిసి హంగామా చేసింది. ఆమె ఇన్ స్టా ఖాతాను ఫాలో అయ్యేవారిలో సమంత, నయన తార, లక్ష్మీ మంచు, నాగ చైతన్య, తమన్నా, వర్ష బొల్లమ్మ వంటి స్టార్స్ సైతం ఉన్నారు.

మింత్ర, వన్ ప్లస్, కెఎఫ్సీ, బోట్ వంటి సంస్థలు ఆమెతో కొలబ్రేట్ అయ్యాయి. యూట్యూబ్ ఆధ్వర్యంలో జరిగిన క్రియేటర్స్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో ఇండియా నుండి వరుసగా రెండో సారి రిప్రజెంట్ అయ్యింది. కాగా, చదువుకున్న తన ఎదుగుదలపై కేస్ స్టడీస్ చేయడం గమనార్హం. అలాగే ఆమె ఐదు భాషలను అనర్గళంగా మాట్లాగలదు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళంలో టక టకా మాట్లాడేస్తుంది. అలాగే నెట్ ఫ్లిక్స్ కూడా ఆమెను ఓ ప్రోగ్రాంకు పిలిచి ఇంటర్వ్యూ చేసింది. అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సోషల్ మీడియా క్వీన్ అయ్యింది నిహారిక. ఇప్పుడు హీరోయిన్ అవతారం ఎత్తింది.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. అయితే సినిమా వివరాలేవీ ప్రకటించలేదు చిత్ర యూనిట్. త్వరలో ఎనౌన్స్ చేయొచ్చు. అయితే ఈ భామకు తెలుగులో మంచి భవిష్యత్తు ఉండబోతుందని తెలుస్తోంది.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomjojobetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş