Swetha
మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తారక్ మూవీస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వినిపిస్తున్నాయి అవేంటో చూసేద్దాం.
మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తారక్ మూవీస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వినిపిస్తున్నాయి అవేంటో చూసేద్దాం.
Swetha
తారక్ ప్రస్తుతం ఇప్పుడు రెండు మూవీస్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ మూవీ.. అలానే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న వార్ 2 మూవీ. అయాన్ ముఖర్జీ ఈ క్రేజి ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహిస్తున్నారు. దేవర తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే తారక్ మీద అంచనాలు కుడా అదే రేంజ్ లో పెరిగిపోయాయి. దీనితో తారక్ నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు.
గత నెల 22 న యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రాగన్ సెట్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక రీసెంట్ గా వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఈ మూవీ మొదటి షెడ్యూల్ కర్ణాటకలో ముగిసిందట. మొదటి షెడ్యూల్ లో నీల్ సినిమాలోని ఓ భారీ యాక్షన్ సిక్వెన్స్ ను ఫినిష్ చేశాడాట. ఈ ఫైట్స్ అన్ని సినిమాకు మంచి హైలెట్ గా నిలుస్తాయనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఈ మూవీ రైట్స్ కోసం భారీ డిమాండ్ ఏర్పడుతుంది. ఇప్పటికే ఓవర్శిస్ రైట్స్ ను ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రూ. 50 కోట్లకు కొనుగోలు చేసేందుకు రెడీ అయ్యాడనే టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ కి సంబందించిన మరిన్ని విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు హృతిక్ రోషన్, తారక్ కలిసి నటిస్తున్న మూవీ వార్ 2 . ఈ మూవీ నుంచి రిలీజ్ డేట్ తప్ప ఇప్పటివరకు మరే అప్డేట్ బయటకు రాలేదు. అయితే ఈసారి మేకర్స్ ఏకంగా టీజర్ నే రిలీజ్ చేయబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమా ఆగస్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి. ఎన్టీఆర్ బర్త్డే కానుకగా ఈ నెలాఖరున వార్ 2 టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనికి సంబందించిన అప్డేట్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ అప్డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.