iDreamPost
android-app
ios-app

NBK 109లో కీలకంగా మారిన దుల్కర్ సల్మాన్ పాత్ర

  • Published Feb 06, 2024 | 5:47 PM Updated Updated Feb 06, 2024 | 5:47 PM

Dulquer Role In NBK 109: నందమూరి బాలకృష్ణ 109వ చిత్రంపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా దుల్కర్ రోల్ కి సంబంధించి గట్టిగా బజ్ ఏర్పడింది.

Dulquer Role In NBK 109: నందమూరి బాలకృష్ణ 109వ చిత్రంపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా దుల్కర్ రోల్ కి సంబంధించి గట్టిగా బజ్ ఏర్పడింది.

  • Published Feb 06, 2024 | 5:47 PMUpdated Feb 06, 2024 | 5:47 PM
NBK 109లో కీలకంగా మారిన దుల్కర్ సల్మాన్ పాత్ర

నందమూరి బాలకృష్ణ, తన 109వ సినిమా.. దర్శకుడు బాబీ కాంబినేషన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు గట్టిగా వార్తలు వస్తున్నాయి. నిజానికి చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ సీతారామం ఫేం స్టార్ సినిమాలో ఖచ్చితంగా ఉన్నట్లూ, ఇద్దరి మధ్య సన్నివేశాలు కూడా ఈ మధ్యనే పూర్తి చేసినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. మహానటి, సీతారామం సినిమాలతో ఆయన తెలుగు నాట చక్కని పాపులారిటీ సంపాదించారు. నిజానికి ఆయన తెలుగు అనే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి రియల్ పాన్ ఇండియా యాక్టర్ గా ప్రసిద్ధి చెందారు. పైన చెప్పుకున్న విధంగా బాలకృష్ణ తదుపరి చిత్రంలో దుల్కర్ సల్మాన్ ఒక ముఖ్య పాత్రలో నటించారని తెలుస్తోంది. కాగా బాలయ్య – దుల్కర్ల మధ్య వచ్చే సన్నివేశాల షూటింగ్ ఈ మధ్య జరిగినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాని సితార ఎంటర్ టైనమెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

ఊర్వశి రౌతేలా ఇందులో ఒక కథానాయికగా ఎంపికైనట్టు ఆమె పలు ఇంటర్వ్యూ లలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ చెప్పారు. యానిమల్ సినిమాతో తాజాగా తిరిగి స్టార్ డమ్ తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ NBK109 సినిమాలో విలన్ పాత్రలో కనపడనున్నారు. బాలకృష్ణ, దుల్కర్ సల్మాన్ మధ్య సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని, చాలా బాగా వచ్చాయని, ప్రేక్షకులు ఈలలు వేసే తరహాలో ఉన్నాయని సోషల్ మీడియాలో చాలా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో దుల్కర్ ఎటువంటి పాత్రను పోషిస్తున్నారు అనేది ఇంకా తెలియ రాలేదు. ఇక ఈ చిత్రంలో రాజకీయానికి సంబంధించి చాలా మాటలు, సన్నివేశాలు ఉంటాయని కూడా అంటున్నారు. ఇంతకు ముందు ‘వీరసింహారెడ్డి’ సినిమాలో ఉన్నట్టుగానే ఈ సినిమాలో కూడా పరోక్షంగా పోలిటికల్ డైలాగ్స్ కొన్ని సన్నివేశాలలో ఉండే అవకాశం కూడా ఎక్కువే అంటున్నారు.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş