iDreamPost
android-app
ios-app

దేవర డబ్బింగ్ వర్క్ స్టార్ట్! గూస్ బంప్స్ పుట్టిస్తున్న లీక్డ్ డైలాగ్!

Jr NTR Devara: జూనియర్ ఎన్​టీఆర్​, కొరటాల శివ కాంబినేషన్​లో తెరకెక్కతున్న 'దేవర' మూవీ డబ్బింగ్ పనులను ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ డైలాగ్ లీకైంది. దీంతో దేవరపై ఆడియన్స్ లో ఆసక్తి మరోస్థాయికి చేరింది.

Jr NTR Devara: జూనియర్ ఎన్​టీఆర్​, కొరటాల శివ కాంబినేషన్​లో తెరకెక్కతున్న 'దేవర' మూవీ డబ్బింగ్ పనులను ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ డైలాగ్ లీకైంది. దీంతో దేవరపై ఆడియన్స్ లో ఆసక్తి మరోస్థాయికి చేరింది.

దేవర డబ్బింగ్ వర్క్ స్టార్ట్! గూస్ బంప్స్ పుట్టిస్తున్న లీక్డ్ డైలాగ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దేవర. ఈ మూవీ రెండు పార్టులుగా విడుదల కానున్నసంగతి తెలిసింది.  తొలిభాగం సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదకానుంది. జనతా గ్యారెజీ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో దేవర సినిమా రాబోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి తరచూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇలా దేవర సినిమా నుంచి వచ్చే అప్ డేట్స్ తారక్ అభిమానులు, మూవీ లవర్స్ లో జోష్ నింపుతోంది.  ఈ క్రమంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే దేవరకు సంబంధించి గూస్ బంప్స్ పుట్టిస్తున్న ఓ  డైలాగ్ లీక్ అయ్యింది.

జూనియర్ ఎన్​టీఆర్​, కొరటాల శివ కాంబినేషన్​లో తెరకెక్కతున్న ‘దేవర’ మూవీ తాజాగా డబ్బింగ్ పనులను ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ షూటింగ్ జరుగుతోందని అనుకుంటున్న సమయంలో ఇటీవలే నటి హిమజ,ఇతర కొందరు నటీనటులు డబ్బింగ్ చెబుతున్న ఫోటోల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని రోజుల క్రితం హిమాజ తనకు సంబంధించి ఓ పోస్టు కూడా పెట్టింది. దేవర సినిమాకు డబ్బింగ్ చెప్పానని, మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నానంటూ ఆమె ఇన్​స్టా వేదికగా వెల్లడించింది. మరోవైపు సినిమా విడుదలకు ఇంకా మూడు నెలలే ఉండటం వల్ల మూవీ టీమ్​ ‘దేవర’ పోస్ట్ ప్రొడక్షన్​ పనులను త్వరగా పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తోంది.

ఇక డబ్బింగ్ పనులను కూడా వేగంగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే హిమాజ, మణిచందన వంటి వారు తమ వాయిస్ డబ్బింగ్ చేబుతున్నారు. ఇలా దేవరకు సంబంధించి డబ్బింగ్ పనులు జరుగుతున్న క్రమంలో ఓ డైలాగ్ లీక్ అయ్యింది. “సాదా సీదా మగాళ్ళు కావాలా..ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా…!” అనే డైలాగ్ లీక్ అయ్యింది. గూస్ పంప్స్ తెప్పిస్తున్న ఈ డైలాగ్..ప్రస్తుతం నెట్టింట్ట తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ డైలాగ్ చూసిన తారక్ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. డైలాగ్ చూసినట్లు అయితే.. దేవర సినిమాలో తారక్ ఓ ఊరి కోసం పోరాడే వీరుడని తెలుస్తోంది.

అంతేకాక గ్రామం కోసం ఏ త్యాగం, ఏ తెగింపుకైనా సిద్ధమైన వ్యక్తి కథ ఉండనుంది. మొత్తంగా దేవర ఓ సాదాసీదా వ్యక్తి కథ కాదు.. ఓ వీరుడి కథగా ఉండనుందని ఈ డైలాగ్ తో మనకు అర్థమవుతుంది. గతంలో దేవర నుంచి విడుదలైన గ్లింప్స్ ఎంతో ఆసక్తిని పెంచాయి. తాజాగా లీకైనా ఈ డైలాగ్… అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలోనే దేవర సినిమా ప్రమోషన్ల కోసం తారక్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్స్ చేస్తున్నారు. మరి.. గూస్ బంప్స్ పుట్టిన ఈ డైలాగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి