iDreamPost
android-app
ios-app

ఇదేం పిచ్చ!! ప్రముఖ హీరోయిన్‌ను పదేళ్లుగా పూజిస్తున్న దంపతులు!

  • Published Jul 21, 2023 | 12:55 PM Updated Updated Jul 21, 2023 | 12:55 PM
  • Published Jul 21, 2023 | 12:55 PMUpdated Jul 21, 2023 | 12:55 PM
ఇదేం పిచ్చ!! ప్రముఖ హీరోయిన్‌ను పదేళ్లుగా పూజిస్తున్న దంపతులు!

సినిమా వాళ్లంటే జనాలకు ఓ ప్రత్యేకమైన అభిమానం ఉండటం సర్వ సాధారణం. సినిమా హీరోలకు, హీరోయిన్లకు గుడి కట్టి పూజలు చేయటం కూడా సర్వ సాధారణమే. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ మాత్రం ఈ అన్ని స్టోరీల కంటే భిన్నమైనది. ఈ స్టోరీలో ఓ జంట దాదాపు పదేళ్లుగా ఓ స్టార్‌ హీరోయిన్‌ను దేవతలా పూజిస్తోంది. ఆమె తమ దేవత అంటూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతోంది. ఈ సంఘటన హర్యానాలో వెలుగు చూసింది.  ఇంతకీ ఎవరా జంట? ఎవరా హీరోయిన్‌? అన్న పూర్తి వివరాల్లోకి వెళితే..

హర్యానాలోని చర్ఖీ దాబ్రి, ధని ఫోగట్‌ గ్రామానికి చెందిన బంటు, సంతోష భార్యాభర్తలు. వీరికి ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ అంటే పిచ్చి. ఆ పిచ్చి ఎంతలా అంటే.. ఆమెను దేవతలా పూజించేంతలా. వీరిద్దరూ గత పదేళ్లుగా కత్రినా కైఫ్‌ ఫొటోలను ఇంటి నిండా అతికించుకున్నారు. కేవలం ఇంట్లో మాత్రమే కాదు.. ఇంటి బయట కూడా ఆమె ఫొటోలే కనిపిస్తాయి. ఆ ఫొటోలకు ప్రతీ రోజు పూజలు చేస్తూ ఉన్నారు. ప్రతీ ఏటా కత్రినా కైఫ్‌ పుట్టిన రోజును ఓ పెద్ద వేడుకలా చేస్తూ ఉన్నారు.

Couples worships to katrina kaif more than 10 years

కేకు కట్‌ చేయటంతో పాటు ఇంటి పక్కన ఉన్న వారికి లడ్డూలు పంచుతూ ఉన్నారు. వీరిద్దరూ కత్రినా కైఫ్‌కు హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్‌ అని ఊరు మొత్తం తెలుసు. ఈ పూజలు, బర్త్‌డే ఫంక్షన్లు చూసి.. కొంతమంది వీరిని పిచ్చోళ్లు అనుకుంటుంటే.. మరికొందరు కత్రినాపై వీరికున్న అభిమానానికి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు! పంచాయతీ ఎన్నికల్లో నిలబడ్డ బంటును ఏక గ్రీవంగా ఎన్నిక చేశారు. ఇక, బంటు, సంతోషలు ఎప్పటికైనా కత్రినా కైఫ్‌ను కలవాలన్న కోరితో ఉన్నారు. మరి, వీరిద్దరి కల త్వరలోనే నెరవేరాలని కోరుకుంటూ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş