Swetha
లోకేష్ కనగరాజ్ , రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన కూలీ సినిమా.. భారీ అంచనాల మధ్యన ఆగష్టు 14 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి సినిమా మీద విపరీతమైన హైప్ ఉండడంతో కూలీకి భారీ ఓపెనింగ్స్ దక్కాయి. కానీ మొదటి షో తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో టాక్ బయటకు రాలేదు

లోకేష్ కనగరాజ్ , రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన కూలీ సినిమా.. భారీ అంచనాల మధ్యన ఆగష్టు 14 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి సినిమా మీద విపరీతమైన హైప్ ఉండడంతో కూలీకి భారీ ఓపెనింగ్స్ దక్కాయి. కానీ మొదటి షో తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో టాక్ బయటకు రాలేదు. దానికి కారణం భారీ అంచనాలు పెట్టుకుని సినిమాకు వెళ్లడమే అని.. మెజారిటీ పీపుల్ అనడం కూడా విన్నాము. బ్లాక్ బస్టర్ కాకపోయినా ఉన్నంత వరకు మాత్రం కూలీ పరవాలేదని అనిపించుకుంది.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 500 కోట్ల రూపాయలను రాబట్టింది. 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తుందని అనుకున్నారు కానీ అది జరగలేదు. ఇక ఇప్పుడు థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుని ఓటిటి ఎంట్రీకి రెడీ అయిపోతుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇక ఈ నెల 11 నుంచి కూలీ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ అప్డేట్ ఇవ్వనున్నారు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.