iDreamPost
android-app
ios-app

విజయ్, రష్మిక ప్రైవేట్ పిక్స్ పై వివాదం.. స్పందించిన నాని

  • Published Dec 03, 2023 | 5:28 PM Updated Updated Dec 03, 2023 | 5:42 PM

హాయ్ నాన్న అంటూ ఈ నెల 7న ధియేటర్లలో పలకరించబోతున్నాడు నాచురల్ స్టార్ నాని. ఈ నేపథ్యంలో బిజీబిజీగా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. ఇటీవల వైజాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా టాలీవుడ్ స్టార్స్ ప్రైవేట్ పిక్స్ ప్రదర్శించడంపై తాజాగా స్పందించారు నాని.

హాయ్ నాన్న అంటూ ఈ నెల 7న ధియేటర్లలో పలకరించబోతున్నాడు నాచురల్ స్టార్ నాని. ఈ నేపథ్యంలో బిజీబిజీగా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. ఇటీవల వైజాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా టాలీవుడ్ స్టార్స్ ప్రైవేట్ పిక్స్ ప్రదర్శించడంపై తాజాగా స్పందించారు నాని.

  • Published Dec 03, 2023 | 5:28 PMUpdated Dec 03, 2023 | 5:42 PM
విజయ్, రష్మిక ప్రైవేట్ పిక్స్ పై వివాదం.. స్పందించిన నాని

నేచురల్ స్టార్ నాని నటించిన ‘హాయ్ నాన్న’ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 7న ఈ మూవీ థియేటర్‌లలో సందడి చేయనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. తండ్రి కూతుర్ల సెంటిమెంట్‌తో పాటు.. ప్రేమ కథను కూడా జోడించి తెరకెక్కించినట్లు ఈ మూవీ ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. ఈ క్రమంలో చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ వేడుకను కూడా పూర్తి చేసుకుంది. అయితే ఆ ఈవెంట్ మధ్యలో ఓ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఇదే అభిమానుల మధ్యన వివాదం తలెత్తేలా చేసింది. దీనితో హీరో నానిపై విమర్శలు వస్తున్నాయి. ఆ విషయంపైన నాని అందరికి ఓ క్లారిటీ ఇచ్చారు. అసలు విషయానికొస్తే..

గత బుధవారం వైజాగ్‌లో ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈవెంట్‌లో భాగంగా యాంకర్ సుమ హీరోయిన్ మృణాల్‌కు ఓ ఫన్నీ టాస్క్ ఇచ్చారు. స్క్రీన్ పైన కొంత మంది సెలబ్రెటీస్ ఫొటోస్ చూపిస్తూ వాటిపైన కామెంట్స్ చెప్పాల్సిందిగా కోరారు. మొదట నాని,నజ్రియా, దుల్కర్ సల్మాన్ ఫొటోస్ చూపించగా.. మృణాల్ తనకు తోచిన కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా స్క్రీన్ మీద రష్మిక, విజయ్ దేవరకొండ ప్రైవేట్ పిక్స్ ప్రత్యక్షమయ్యాయి. వాళ్లిద్దరూ బాలిలో వెకేషన్ లో గడిపిన ఫొటోస్‌ను స్క్రీన్ మీద ఉంచారు. దీనితో అందరు ఒక్కసారిగా కంగు తిన్నారు. యాంకర్ సుమ కూడా ఏం చేయాలో అర్థం కాక కాస్త తడబడ్డారు. మృణాల్ కూడా ఆ ఫోటో పై ఎలా స్పందించాలో తెలియక ‘వెకేషన్ మోడ్ ఆన్’ అంటూ ముగించేశారు. కానీ ఈ సంఘటనపైన నాని పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన సినిమా ప్రచారం కోసం ఇతర నటీనటుల పర్సనల్ స్పేస్‌కు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ.. మండిపడుతున్నారు. విజయ్, రష్మిక ఫ్యాన్స్ నానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది.

అయితే, తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాని ఈ వివాదం మీద క్లారిటీ ఇచ్చారు. ‘అసలు అది మాకు తెలియకుండా జరిగింది. ఒక ఈవెంట్ జరుగుతున్నపుడు దానికోసం చాలా మంది పని చేస్తారు. ఎవరు ఎందుకు చేశారనే క్లారిటీ లేదు. బహుశా తెలియకుండా ఈ తప్పిదం జరిగి ఉండొచ్చు. విజయ్, రష్మిక ఇద్దరూ నా స్నేహితులే.. వాళ్ళ పిక్స్ బయటపెట్టాలని మేమెలా అనుకుంటాం!. ఆ సంఘటన వలన బాధపడిన వారికి క్షమాపణ చెప్తున్నా’ అంటూ.. నాని తెలిపారు. ‘ఆ పిక్ ప్రదర్శించిన వ్యక్తిని ప్రశ్నించి ఇపుడు లాభం లేదు. ఎందుకంటే తన ఉద్యోగం ఎక్కడ పోతుందా అనే టెన్షన్ లో అతను ఉంటాడు’. అని నాని చెప్పుకొచ్చారు. ఏదేమైనా, నటీ నటుల పర్సనల్ ఫొటోస్ ఇలా వైరల్ అవుతూ ఉండడం అనేది సహజం. కానీ , ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం వలన వివాదాలకు దారి తీసింది. మరి, ఈ విషయంపైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetmoney girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş