iDreamPost
android-app
ios-app

తమ్ముడి దర్శకుడికి చైతు ఛాన్స్

  • Published May 23, 2022 | 7:47 PM Updated Updated May 23, 2022 | 7:47 PM
  • Published May 23, 2022 | 7:47 PMUpdated May 23, 2022 | 7:47 PM
తమ్ముడి దర్శకుడికి చైతు ఛాన్స్

గత ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రూపంలో అఖిల్ కో డీసెంట్ హిట్ ఇచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ త్వరలో నాగ చైతన్యతో ఓ సినిమా చేయబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించే ఈ మూవీ ఏ జానరనేది ఇంకా తెలియాల్సి ఉంది. కథ ఓకే అయ్యిందని భాస్కర్ ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ లాక్ చేసే పనిలో ఉన్నారట. అన్నీ పూర్తయ్యాక అఫీషియల్ గా లాంచ్ చేసి షూటింగ్ మొదలుపెడతారు. హీరోయిన్ ఎవరు సంగీతం ఎవరు అందిస్తారు లాంటి వివరాలేవీ ఇంకా బయటికి రాలేదు. భాస్కర్ గ్రిపు ఉన్నది లవ్ అండ్ రొమాంటిక్ సబ్జెక్ట్స్ లోనే కాబట్టి ఇది కూడా అదే కోవలో ఉండొచ్చు.

అఖిల్ మూవీ మరీ బ్లాక్ బస్టర్ కాకపోయినా బొమ్మరిల్లు భాస్కర్ తన ఉనికిని చాటుకోవడంలో సక్సెస్ అయ్యాడు. రామ్ చరణ్ ఆరంజ్, రామ్ ఒంగోలు గిత్త లాంటి మంచి అవకాశాలను చేతులారా చెడగొట్టుకుని వాటిని డిజాస్టర్స్ చేసిన భాస్కర్ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మొదటి సినిమా మినహాయిస్తే పరుగు ఒక్కటే హిట్ కింద చెప్పుకోవచ్చు. తమిళంలో తీసిన బెంగళూర్ నాట్కళ్ కూడా ఫ్లాపే. ఏకంగా ఎనిమిదేళ్ల గ్యాప్ తీసుకుని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో కలిసినప్పుడు గీత ఆర్ట్స్ ఇచ్చిన అవకాశం ఇవ్వడం ఇప్పుడు ప్లస్ అయ్యింది. తమ్ముడిని హ్యాండిల్ చేసిన విధానం చూశాక చైతు ఎక్కువ ఆలోచన చేయకుండా ఓకే చెప్పాడేమో.

నాగ చైతన్య విషయానికి వస్తే ప్రస్తుతం థాంక్ యు విడుదలకు రెడీ అవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపు పూర్తయినట్టే. ఆగస్ట్ లో లాల్ సింగ్ చద్దా వస్తుంది కాబట్టి దానికన్నా ముందు ఇది హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఈ ఏడాది ప్రైమ్ లో టెలికాస్ట్ అయ్యే దూత ద్వారా చైతు ఓటిటి డెబ్యూ చేయబోతున్నాడు. ప్రస్తుతం దాని చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. థాంక్ యు టైంలోనే దర్శకుడు విక్రమ్ కుమార్ నాగ చైతన్యలు దీనికి లాక్ అయ్యారు. బంగార్రాజు, థాంక్ యు, లాల్ సింగ్ చద్దా, దూత ఇలా మొత్తం నాలుగు సార్లు ఫ్యాన్స్ కి కనువిందు చేయబోతున్నాడు అక్కినేని హీరో. మజిలీ తర్వాత దూకుడు బాగుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet