iDreamPost
android-app
ios-app

కుర్చీ తాత బూతు పురాణం.. పోలీసులకు ఫిర్యాదు!

  • Published Mar 06, 2024 | 3:50 PM Updated Updated Mar 06, 2024 | 3:50 PM

Police Case Against The Kurchi Thatha: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొంతమంది రాత్రికి రాత్రే ఫేమస్ అవుతున్నారు. అలాంటి వారిలో కుర్చీ తాత ఒకరు. ఒక్క డైలాగ్ తో యూట్యూబ్ ని షేక్ చేశాడు.

Police Case Against The Kurchi Thatha: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొంతమంది రాత్రికి రాత్రే ఫేమస్ అవుతున్నారు. అలాంటి వారిలో కుర్చీ తాత ఒకరు. ఒక్క డైలాగ్ తో యూట్యూబ్ ని షేక్ చేశాడు.

  • Published Mar 06, 2024 | 3:50 PMUpdated Mar 06, 2024 | 3:50 PM
కుర్చీ తాత బూతు పురాణం.. పోలీసులకు ఫిర్యాదు!

సోషల్ మీడియా వచ్చిప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. డ్యాన్స్, సాంగ్స్, ఇతర సాహస కృత్యాలకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్ అప్ లోడ్ చేస్తుంటారు. అదృష్టం కొద్ది అది క్లిక్ అయి లక్షల్లో వ్యూస్ రావడంతో రాత్రికి రాత్రే ఫేమస్ అయినవాళ్లు ఉన్నారు. ఈ మధ్య కొంతమంది రీల్స్ లో ఫేమస్ కావడానికి నానా తంటాలు పడుతున్నారు. హైదరాబాద్ కృష్ణ కాంత్ పార్క్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ బిక్షమెత్తుకుంటూ జీవించే కాలా పాషా అలియాజ్‌ ‘కుర్చీ మడత పెట్టి’ అనే బూతు డైలాగ్ తో కుర్చీతాతగా తెగ ఫేమస్ అయ్యాడు. ఇటీవల ఆయనపై యూట్యూబర్స్ పోలీస్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కుర్చీతాత వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళితే..

ఆ కుర్చీని మడత పెట్టి.. అంటూ ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియాలో బీభత్సమైన పాపులారిటీ సంపాదించాడు కాలా పాషా అలియాస్ కుర్చీతాత. హైదరాబాద్ లో కృష్ణ కాంత్ పార్క్ పరిసర ప్రాంతాలత్లో బిక్షమెత్తుకుంటూ జీవించే కాలా పాష ఓ యుట్యూబర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆ కుర్చీని మడత పెట్టి’ అనే డైలాగ్ ఫేమస్ అయ్యింది. ఎంతగా అంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘గుంటురు కారం’ మూవీలో ఈ డైలాగ్ తో పాట వచ్చింది. అయితే కుర్చీ తాత నిత్యం తాగుతూ నోటికి ఏది వస్తే అది మాట్లాడటం కొంతమందికి ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉన్నా కొంతమందికి చిర్రెత్తుకొస్తుంది. సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఇలా ప్రతి ఒక్కరిని బండ బూతులు తిట్టడంతో కొంతకాలంగా ఫేమస్ అయ్యాడు. ఆ మధ్య వైజాగ్ సత్య, స్వాతి నాయుడు తమను బూతులు తిడుతున్నాడని కుర్చి తాతపై కేసు పెట్టి జైలుకు పంపించారు.

మరోసారి తమపై ఎక్కడ పడితే అక్కడ బూతులు మాట్లాడుతున్నాడని కుర్చితాతపై స్వాతి నాయుడు, వైజాగ్ సత్య మంగళవారం మధురానగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్ తీసే స్వాతి నాయుడు, వైజాగ్ సత్య గతంలో కుర్చీ తాతతో సన్నిహితంగా ఉండేవారు. అదే సమయంలో తమన్ ‘కుర్చీ మడతపెట్టి’ డైలాగ్ మహేష్ బాబు మూవీలో సాంగ్ రావడంతో కుర్చీతాత మరింత ఫేమస్ అయ్యాడు. తనకు బాగా డబ్బు వస్తుందని.. వైజాగ్ సత్య అంతా తీసుకొని మోసం చేస్తున్నాడని సోషల్ మీడియాలో గోల గోల చేశాడు. అంతేకాదు స్వాతి నాయుడు, వైజాగ్ సత్యపై అసభ్య పదజాలంతో దుర్భాషలాడటంతో బాధితులు జూబ్లీ హిల్స్ , మధురానగర్ లో పోలీస్ కేసులు పెట్టారు. ఈ క్రమంలోనే కుర్చీ తాతను అరెస్ట్ చేయడంతో తర్వాత వారితో రాజీ కుదుర్చుకొని బయటకు వచ్చాడు. తాజాగా తమనను మరోసారి తిడుతున్నాడని ఇద్దరు మరోసారి కుర్చీతాతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetvole girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş