iDreamPost
android-app
ios-app

కంగువ నిర్మాతపై కేసు.. అలా చేశాడంటూ పనిమనిషి కూతురు ఫిర్యాదు!

  • Published Apr 26, 2024 | 8:11 PM Updated Updated Apr 26, 2024 | 8:11 PM

సూర్య హీరోగా కంగువా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్త బ్యానర్లలో కె.ఈ. జ్ఞానవేల్ రాజా, ఉప్పలపాటి ప్రమోద్, వంశీ నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ నిర్మాతల్లో ఒకరిపై పనిమనిషి కేసు పెట్టింది.

సూర్య హీరోగా కంగువా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్త బ్యానర్లలో కె.ఈ. జ్ఞానవేల్ రాజా, ఉప్పలపాటి ప్రమోద్, వంశీ నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ నిర్మాతల్లో ఒకరిపై పనిమనిషి కేసు పెట్టింది.

  • Published Apr 26, 2024 | 8:11 PMUpdated Apr 26, 2024 | 8:11 PM
కంగువ నిర్మాతపై కేసు.. అలా చేశాడంటూ పనిమనిషి కూతురు ఫిర్యాదు!

సూర్య నటిస్తున్న కంగువ సినీ నిర్మాతల్లో ఒకరైన కె.ఈ. జ్ఞానవేల్ రాజా, ఆయన భార్య నేహాపై చెన్నై మాంబలం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈయన ఇల్లు త్యాగరాయ నగర్ లో ఉంది. లక్ష్మి అనే మహిళ నిర్మాత ఇంట్లో పనిమనిషిగా పని చేస్తుంది. అయితే కొన్ని రోజుల క్రితం జ్ఞానవేల్ ఇంట్లో నగలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. దీంతో జ్ఞానవేల్ రాజా భార్య నేహా పనిమనిషి లక్ష్మి మీద అనుమానం పెట్టుకుంది. ఆమెను నగల గురించి అడిగితే తనకు తెలియదని చెప్పింది. మరుసటి రోజు పనికి రాలేదు. దీంతో అనుమానం రెట్టింపు అయ్యింది. పనిమనిషి లక్ష్మి ఫోన్ నంబర్ కి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో నేహా జ్ఞానవేల్ రాజాకి ఈ విషయం గురించి చెప్పారు.

జ్ఞానవేల్ రాజా మాంబలం పోలీస్ స్టేషన్ లో నగలు కనబడట్లేదని ఫిర్యాదు చేశారు. అలానే పనిమనిషి లక్ష్మి మీద అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు లక్ష్మిని పిలిచి నగల గురించి విచారణ చేపట్టారు. ఆ మరుసటి రోజు లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బంధువులు ఆమెను ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా.. వైద్యులు ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నారు. అయితే లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడానికి కారణం నిర్మాత జ్ఞానవేల్ రాజా, ఆయన భయ నేహా అని ఇద్దరిపై మాంబలం పోలీస్ స్టేషన్ లో పనిమనిషి కుమార్తె ఫిర్యాదు చేసింది. జ్ఞానవేల్ రాజా భార్య ఆ నగలను ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటారని.. దానికి తన తల్లి లక్ష్మి మీద నిందలు వేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.

ఈ ఇద్దరూ తన తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించారని.. ఆమె కేసు పెట్టింది. దీంతో మాంబలం పోలీసులు జ్ఞానవేల్ రాజా, ఆయన భార్య నేహాపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే జ్ఞానవేల్ రాజా.. సూర్య, కార్తీలకు బంధువు. పరుత్తి వీరం సినిమాతో నిర్మాతగా కోలీవుడ్ లో అడుగుపెట్టారు. ఆ తర్వాత సింగం, సింగం 3, బిర్యాని, నోటా, టెడ్డి వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం సూర్య నటిస్తున్న కంగువ సినిమాకి ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. మరి నిర్మాతపై పనిమనిషి కూతురు కేసు పెట్టడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom