iDreamPost
android-app
ios-app

Yadamma Raju: తండ్రి కాబోతున్న యాదమ్మ రాజు! పోస్ట్ వైరల్..

  • Published Jul 21, 2024 | 3:36 PM Updated Updated Jul 21, 2024 | 3:36 PM

జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తాము తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఆ వివరాల్లోకి వెళితే..

జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తాము తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 21, 2024 | 3:36 PMUpdated Jul 21, 2024 | 3:36 PM
Yadamma Raju: తండ్రి కాబోతున్న యాదమ్మ రాజు! పోస్ట్ వైరల్..

యాదమ్మ రాజు.. ‘పటాస్’ స్టాండప్ కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని, ఇప్పుడు ఏకంగా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తున్నాడు. మరో కమెడియన్ సద్దాంతో కలిసి పలు షోల్లో స్కిట్స్ చేస్తూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం జబర్ధస్త్ షోతో పాటుగా మరికొన్ని షోలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నాం అంటూ యాదమ్మ రాజు-స్టెల్లా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ యాదమ్మ రాజు త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని తన భార్య స్టెల్లా రాజ్ తో కలిసి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. యూట్యూబర్ స్టెల్లారాజ్ ను ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసుకున్నాడు యాదమ్మ రాజు. ఈ సందర్భంగా..”8 సంవత్సరాల మా ప్రేమ, ఏడాదిన్నర వైవాహిక జీవితంలో ఎన్నో కష్టాలను, కన్నీళ్లను,  సమస్యలను, నవ్వులను చూశాం. అన్నింటినీ ఎదుర్కొంటూ స్ట్రాంగ్ అవుతూ ముందుకు సాగుతున్నాం. ఈ క్రమంలోనే ఓ గొప్ప సంతోషం మా జీవితంలోకి వచ్చింది. మా ఫ్యామిలీ పెద్దగా అవ్వబోతోంది. మా ఈ జర్నీలో మీ సపోర్ట్, లవ్ ను అందించిన మీ అందరికి ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చింది ఈ జంట. దాంతో ఈ విషయం తెలిసిన అభిమానులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్న యాదమ్మ రాజు దంపతులకు విషెస్ చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by sharon stella pastham (@stellaraj_777)

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş