iDreamPost
android-app
ios-app

నన్ను రే*ప్ చేయబోయారు.. వారి మీద కూడా అనుమానమే: స్నిగ్ధ

  • Published Mar 26, 2024 | 8:47 PM Updated Updated Mar 26, 2024 | 8:47 PM

Snidha On Her Bad Past: టాలీవుడ్ లో ఉన్న లేడీ కమీడియన్స్ లో స్నిగ్ధాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆమె కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ ఎంతో కొత్తగా ఉంటాయి. అలాంటి స్నిగ్ధ లైఫ్ లో చెప్పుకోలేని విషాదం ఉంది.

Snidha On Her Bad Past: టాలీవుడ్ లో ఉన్న లేడీ కమీడియన్స్ లో స్నిగ్ధాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆమె కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ ఎంతో కొత్తగా ఉంటాయి. అలాంటి స్నిగ్ధ లైఫ్ లో చెప్పుకోలేని విషాదం ఉంది.

  • Published Mar 26, 2024 | 8:47 PMUpdated Mar 26, 2024 | 8:47 PM
నన్ను రే*ప్ చేయబోయారు.. వారి మీద కూడా అనుమానమే: స్నిగ్ధ

టాలీవుడ్ లో చాలామంది కమెడీయిన్స్ ఉన్నారు. కానీ, కొందరిలో మాత్రం ఒక యునీక్ టాలెంట్ ఉంటుంది. వాళ్లని చూస్తేనే ఫ్యాన్స్ తెగ నవ్వేస్తూ ఉంటారు. వారి మాట, చూపు, బాడీ లాంగ్వేజ్ ఇలా ఏది చూసినా నవ్వొస్తుంది. అలాంటి వారిలో స్నిగ్ధ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. ఆమెలో ఉన్న టాలెంట్ కు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో ఫిదా అయిపోయారు. ఇప్పటికే అనేక సినిమాల్లో నటించి ఆడియన్స్ ని మెప్పించింది. అయితే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే స్నిగ్ధ లైవ్ లో ఇంత విషాదం దాగుందని ఎవరికీ తెలిసి ఉండదు. ఆ విషయాన్ని స్వయంగా స్నిగ్ధానే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

రీతూ చౌదరి ప్రస్తుతం దావత్ అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో కాస్త బోల్డ్ గానే సాగుతోంది. ఏదైనా స్ట్రైట్ అవే అడిగేస్తూ.. వచ్చిన వాళ్ల నుంచి అలాంటి కొన్ని బోల్డ్ ఆన్సర్స్ నే రాబడుతోంది. అయితే ఈ షోలో తాజాగా స్నిగ్ధ పాల్గొంది. ఆమె ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో మొదట స్నిగ్ధ చాలా జోవియల్ గా మాట్లాడింది. పెళ్లి గురించి, తనకు ఉన్న రిలేషన్స్ గురించి, తాను చేసిన ప్రాంకులు, ఏడిపించిన స్టార్ల గురించి ఎంతో చక్కగా చెప్పేసింది. కానీ, ఆ తర్వాత మాత్రం స్నిగ్ధ తన జీవితంలో జరిగిన చెడు గురించి, తనకు జరిగిన కొన్ని ఘటనల గురించి చెప్పుకొచ్చింది. వాటిలో తనపై రే*ప్ అటెంప్ట్ జరిగింది అంటూ చెప్పడంతో అందరూ షాకయ్యారు.

అప్పటి వరకు సరదాగా మాట్లాడిన స్నిగ్ధ.. “నా మీద మొలస్టేషన్ జరిగింది. అదీ ఇదీ ఏముంది నా మీద రే*ప్ అటెంప్ట్ జరిగింది. నేను ఎలాగో తప్పించుకుని పారిపోయాను. కానీ, ఆ ట్రాన్స్ తో దాదాపు పదేళ్లు బాధ పడన్నాను. ఎవరిని చూసినా అనుమానంగానే ఉండేది. నాన్న పక్కన పడుకున్నా నాకు భయంగా ఉండేది. నాన్న, మామ ఎవరు పట్టుకున్నా వాళ్లది గుడ్ టచ్చా? బ్యాడ్ టచ్చా అనే భయం ఉండేది. వాళ్లు పాపం నన్ను అంతకు ముందులాగానే ప్యాంపర్ చేసేవాళ్లు. కానీ, నాకు మాత్రం భయంగా ఉండేది” అంటూ స్నిగ్ధ తన లైఫ్ లో జరిగిన ఒక భయానక సంఘటన గురించి చెప్పుకొచ్చింది. అలాగే రీతూ మరో ప్రశ్న అడిగింది. నీ లైఫ్ లో రిగ్రెట్ ఫీలయ్యే విషయం ఏదైనా ఉందా? అని అడిగింది.

రిగ్రెట్ అయ్యే విషయం గురించి చెప్తూ.. స్నిగ్ధ తన లైఫ్ లో ఉన్న మరో విషాదం గురించి చెప్పుకొచ్చింది. “అమ్మ రా రా అని అడుగుతోంది అని వీకెండ్ కి టికెట్స్ బుక్ చేశాను. శనివారం వెళ్దామని టికెట్స్ బుక్ చేశాను. అయితే అమ్మ గురువారం చనిపోయింది. అన్నిసార్లు పిలిచినందుకు వెళ్లినా బాగుండేదేమో? వెళ్లి ఉండాల్సింది కదా అనే రిగ్రెట్ మాత్రం ఉంది” అంటూ స్నిగ్ధ తల్లికి సంబంధించిన విషయం ఆడియన్స్ తో పంచుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది. అందరినీ నవ్వించే స్నిగ్ధ లైఫ్ లో ఇం విషాదం దాగుందా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. స్నిగ్ధ నయని పంచుకున్న విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet