iDreamPost
android-app
ios-app

Comedian Satya: సత్య బయోగ్రఫీ.. డైరెక్టర్ కావాలి అనుకుని యాక్టర్ అయ్యాడు..

Comedian Satya Movies And Biography: టాలీవుడ్ లో కమెడియన్స్ కి ఉండే గుర్తింపు, ఆదరణ నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. అయితే అందరికీ ఆ స్థాయి దొరకడం కష్టం. చాలా తక్కువ సమయంలోనే కమెడియన్ సత్యకు ఆ స్థాయి దక్కింది. కానీ, ఇండస్ట్రీ నుంచే ఇంకా గుర్తింపు లభిస్తున్నట్లు కనిపించడం లేదు.

Comedian Satya Movies And Biography: టాలీవుడ్ లో కమెడియన్స్ కి ఉండే గుర్తింపు, ఆదరణ నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. అయితే అందరికీ ఆ స్థాయి దొరకడం కష్టం. చాలా తక్కువ సమయంలోనే కమెడియన్ సత్యకు ఆ స్థాయి దక్కింది. కానీ, ఇండస్ట్రీ నుంచే ఇంకా గుర్తింపు లభిస్తున్నట్లు కనిపించడం లేదు.

Comedian Satya: సత్య బయోగ్రఫీ.. డైరెక్టర్ కావాలి అనుకుని యాక్టర్ అయ్యాడు..

టాలీవుడ్ లో హీరోకి ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తమ అభిమాన హీరో తెర మీద కనిపిస్తే చాలు.. చొక్కాలు చించేసుకుంటారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మాత్రమే కాదు.. ఇండియన్ సినిమాలో హీరోకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కమెడియన్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. యాక్షన్ తర్వాత మన ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడేది కామెడీనే. తమను నవ్వించిన యాక్టర్ ని అస్సలు మర్చిపోరు. కమెడియన్స్ కి కూడా అభిమానులు ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి హీరో రేంజ్ అభిమాన సంఘాలను కూడా మనం చూశాం. ఇప్పుడు అలాంటి ఒక క్రేజ్ మన సత్యకు వచ్చేసింది. నిజానికి ఇప్పుడు కాదు.. ఆ క్రేజ్, గుర్తింపు వచ్చి చాలానే రోజులు అవుతోంది. కానీ, ఆ స్థాయి అవకాశాలే ఇంకా రావడం లేదు. అదేంటి? అన్ని సినిమాలు చేస్తుంటే అలా అంటావ్ అని కోప్పడకండి.. కాస్త క్లియర్ గా మాట్లాడుకుందాం.

కమెడియన్ సత్య అసలు యాక్టర్ అవ్వాలి అనుకోలేదు, ఎక్కడా యాక్టింగ్ కూడా నేర్చుకోలేదు. అందుకే అంత బాగా నవ్విస్తున్నాడేమో?.. “జస్ట్ కిడ్డింగ్”. నిజానికి సత్య ఒక డైరెక్టర్ అవ్వాలి అని కలలు కన్నాడు. అందుకోసమే బీటెక్ చదువును మధ్యలోనే వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాడు. అప్పటికి అతనికి డైరెక్టర్ కావాలి అనే కల తప్ప మరొకటి లేదు. 90’స్ కిడ్స్ ఫేవరెట్ కామెడీ సీరియల్ అమృతానికి సత్య అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ కూడా చేశాడు. అలాగే ఆ సీరియల్ లో ‘అన్ హ్యాపీ డేస్’ అనే ఎపిసోడ్లో యాక్టింగ్కూడా చేశాడు. ఆ తర్వాత మళ్లీ యాక్టర్ గా ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే యాక్టర్ కావాలి అనేది మనోడు గోల్ కానే కాదు. అందుకే మళ్లీ ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయితే హీరో నితిన్- ప్రియమణి ‘ద్రోణ’ చిత్రానికి సత్య అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అప్పుడు సత్యలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ ని గుర్తించిన నితిన్.. యాక్టర్ కావాలి అని ప్రోత్సహించాడు.

నితిన్ చెప్పిన తర్వాత సత్య కూడా యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టేశాడు. ఇంకేముంది.. టాలీవుడ్ కి ఒక టాలెంటెడ్, బెస్ట్ హ్యూమర్, స్పాంటినిటీ కలిగిన యాక్టర్ దొరికేశాడు. నిజానికి ఈ విషయంలో మాత్రం నితిన్ కి తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఇంకేముంది ఆ తర్వాత అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తనలో ఉన్న యాక్టింగ్స్ స్కిల్స్ ని మెరుగు పరుచుకోవడానికి వాడుకున్నాడు. సత్య జబర్దస్త్ తో కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అలా అతను ఏం చేసినా కూడా ఆడియన్స్ పడి పడి నవ్వుకోవడం ఆనవాయితీ అయిపోయింది. యాక్టింగ్ కి స్కోప్, మంచి మంచి డైలాగ్స్, అదిరిపోయే కామెడీ సీక్వెన్సులు ఉంటే ఎవరైనా నవ్విస్తారు. కానీ, ఎలాంటి యాక్టింగ్ స్కోప్, ఎలాంటి కామెడీ పంచులు లేకపోయినా.. సినిమా స్థాయిని పెంచేసే కమెడియన్స్ మనకు చాలా అరుదుగా ఉన్నారు. వారిలో ఒకరు అల్లు రామలింగయ్య అయితే.. మరొకరు సునీల్ అని చెప్పచ్చు. వీళ్లు ఎలాంటి డైలాగ్స్ లేకపోయినా.. కనీసం నోరు కూడా తెరవకుండానే కడుపుబ్బా నవ్వించేస్తూ ఉంటారు.

నిజానికి కథలో దమ్ములేకపోయినా వీళ్లు భుజనా వేసుకుని ముందుకు తీసుకెళ్లిన సినిమాలు కూడా ఉన్నాయి. ఆ స్థాయి నటన, టాలెంట్ సత్యలో మనం చూస్తూనే ఉన్నాం. ఏ పాత్ర ఎంచుకున్నా, ఎలాంటి సీన్ అయినా, అసలు ఆ సీన్ లో కామెడీ స్కోప్ లేకపోయినా కేవలం బాడీ ల్యాంగ్వేజ్, ఎక్స్ ప్రెషన్స్, మేనరిజంతో థియేటర్ మొత్తాన్ని గొల్లున నవ్వేలా చేస్తున్నాడు. కేవలం నటన మాత్రమే కాదు.. అతను చేసే ఇమిటేషన్స్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎంత గొప్ప గొప్ప యాక్టర్స్, పబ్లిక్ ఫిగర్స్ ని అయినా తమ బాడీ ల్యాంగ్వేజ్ తో సహా డిటో దించేస్తాడు. సత్య జస్ట్ అలా స్క్రీన్ మీద కనిపించినా కూడా ఆడియన్స్ నవ్వేస్తుంటారు. సినిమాలో కామెడీ చేయడం వేరు.. సినిమా మొత్తంలో ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో కనిపిస్తూ వచ్చిన ప్రతి సీన్ లో నవ్వించడం వేరు. అలాంటి సినిమాలు సత్యకు చాలానే ఉన్నాయి. ఛలో, గద్దలకొండ గణేశ్, మత్తు వదలరా, రంగబలి, మత్తు వదలరా 2 వంటి చిత్రాలే అందుకు మంచి ఉదాహరణ.

యాక్టర్ సత్య టాలెంట్ ఏంటో ఇప్పటికే చాలాసార్లు నిరూపించుకున్నాడు. సత్య ఏం చేయగలడో చూపించాడు. సత్యకు ఉన్న ఫాలోయింగ్ ఏంటో ఇండస్ట్రీ కూడా చూసింది. కానీ, సత్యను వాడుకోవడంలో ఎందుకో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇంకా వెనుకపడి పోయింది అని చెప్పాలి. ఎందుకంటే ఇంకా సత్యకు టైర్ 1, టైర్ 2 హీరోల చిత్రాల్లో ప్రామినెంట్ రోల్స్ దొరకడం లేదు. పెద్ద హీరోలతో ఒక మంచి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ దొరకడం లేదు. అంత టాలెంట్ ఉన్నా కూడా వాడుకోవడంలోనే ఇండస్ట్రీ ఎక్కడో వెనుకాడుతున్నట్లు కనిపిస్తోంది. పాత్ర ఏదైనా, డైలాగ్ ఏదైనా, సీన్ ఏదైనా సత్య ఎంటర్ అయితే నవ్వులు పూయించడం మాత్రం పక్కా అని తెలుగు ప్రేక్షకులకు నమ్మకం ఉంది. ఇప్పటికైనా టాలీవుడ్ యాక్టర్ సత్యను సరిగ్గా వవాడుకుంటుందేమో చూడాలి. మరి.. సత్య చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి.