iDreamPost
android-app
ios-app

నా పిచ్చికుక్క బిహేవియర్ ని భరించారు.. రవితేజపై హర్షచెముడు కామెంట్స్

  • Author ajaykrishna Published - 08:55 AM, Wed - 12 July 23
  • Author ajaykrishna Published - 08:55 AM, Wed - 12 July 23
నా పిచ్చికుక్క బిహేవియర్ ని భరించారు.. రవితేజపై హర్షచెముడు కామెంట్స్

టాలెంట్, హార్డ్ వర్క్ ఉంటే సక్సెస్ ఎప్పుడైనా వస్తుందని ఇప్పటిదాకా ఇండస్ట్రీలో చాలామంది ప్రూవ్ చేశారు. ఎంతోమందికి ఆదర్శంగా కూడా నిలుస్తుంటారు. టాలీవుడ్ లో ఇంతవరకు కమెడియన్స్ గా కెరీర్ మొదలుపెట్టి.. హీరోలుగా మారిన వారిని చాలా చూశాం. ఇప్పుడు అదే వరుసలో చేరుతున్నాడు కమెడియన్ వైవా హర్ష. అసలు పేరు హర్ష చెముడు.. అయినప్పటికీ తనకు పేరు తెచ్చిన వైవా షార్ట్ ఫిల్మ్ ద్వారా వైవా హర్షగా మారాడు. అయితే.. హర్ష, దివ్య శ్రీపాద హీరోహీరోయిన్స్ గా నటించిన సినిమా ‘సుందరం మాస్టర్’. కళ్యాణ్ సంతోష్ అనే డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని మాస్ రాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా వైజాగ్ లో సుందరం మాస్టర్ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా మూవీ టీజర్ లాంచ్ చేశారు. ఈ సందర్బంగా హర్ష చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాను మాట్లాడుతూ.. “తానిప్పుడు ఈ స్టేజిలో ఉండటానికి ప్రధాన కారణం.. తన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ వైవా డైరెక్టర్ శబరీష్. ఆయన లేకపోతే నేను లేనట్లే. ఈ స్టేజి నుండి శబరీష్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ తర్వాత నేను థాంక్స్ చెప్పుకోవాల్సింది నా ఫ్యామిలీకి. నా పేరెంట్స్, నా భార్య.. సరైన టైమింగ్ లేని నా పిచ్చికుక్క బిహేవియ‌ర్‌ ని భరించి.. ఇంతదాకా సపోర్ట్ చేస్తూ వచ్చారు” అని అన్నాడు.

హర్ష ఇంకా మాట్లాడుతూ.. నా ఫ్యామిలీ సపోర్ట్ తో పాటు ప్రేక్షకుల సపోర్ట్ కూడా లేకపోతే నేను ఇంత హ్యాపీగా ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకునే వాడిని కాదు. నా వైవా షార్ట్ ఫిల్మ్ రిలీజై పదేళ్లు అవుతుంది. ప‌దేళ్ల ముందు షార్ట్ ఫిల్మ్‌తో మీ ముందుకు వ‌స్తే.. 10 ఏళ్లలో మీరు న‌న్ను ఇక్కడ నిలబెట్టారు. లైఫ్ లో క‌ష్టప‌డితే అంద‌రూ మీ ల‌క్ష్యాల‌ను చేరుకుంటారు. ఇది నాకు చాలా ఎమోష‌న‌ల్ మూమెంట్‌. డైరెక్టర్ క‌ళ్యాణ్ ఈ స్క్రిప్ట్‌ బ్యూటీఫుల్‌ గా రాస్తే.. ,మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, సుధీర్ మూవీని అద్భుతంగా నిర్మించారు. ఇక నా ఫస్ట్ మూవీ హీరోగా.. టీజర్ లాంచ్ వైజాగ్ లో జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఈవెంట్ కి వచ్చిన సాయిధరమ్ తేజ్ గారికి చాలా థ్యాంక్స్’ అని చెప్పుకొచ్చాడు హర్ష. మరి హర్ష మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş