iDreamPost
android-app
ios-app

ఒకప్పటి కమెడియన్‌ బబ్లూ గుర్తున్నాడా.. ఇప్పుడేం చేస్తున్నాడంటే!

  • Published Jul 21, 2023 | 10:28 AMUpdated Jul 21, 2023 | 10:28 AM
  • Published Jul 21, 2023 | 10:28 AMUpdated Jul 21, 2023 | 10:28 AM
ఒకప్పటి కమెడియన్‌ బబ్లూ గుర్తున్నాడా.. ఇప్పుడేం చేస్తున్నాడంటే!

మిగతా రంగాలతో పోలిస్తే.. సినీ పరిశ్రమలో రాణించడం అంటే మాములు విషయం కాదు. ఇక్కడ సక్సెస్‌ రావడానికి ఎంతో సమయం పట్టవచ్చు.. కానీ తెర మరుగు కావడానికి ఒక్క సినిమా ప్లాఫ్‌ చాలు. ఇండస్టీలో ఒక్క సారి ఫెయిల్యూర్‌ పలకరిస్తే.. ఇక వారి పని అంతే. స్టార్‌ హీరోలు, హీరోయిన్ల సంగతి పక్కకు పెడితే.. మిగతా అందరికి.. సక్సెస్‌ మాత్రమే వారి కెరీర్‌ను నిలబెట్టే ఆయుధం. సక్సెస్‌ ఉన్నప్పుడు సంపాదించుకున్న క్రేజ్‌.. ఒక్క ఫెయిల్యూర్‌తో పోతుంది. అన్నాళ్లు మన చుట్టూ తిరిగినవారు ఆ తర్వాత కనీసం పట్టించుకోరు. కానీ ప్రేక్షకులు మాత్రం అలా కాదు. ఒక్కసారి వారి మదిలో స్థానం సంపాదించుకుంటే చాలు.. ఇక వారిని జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు ప్రేక్షకులు. ఇండస్ట్రీ వారిని మర్చిపోయినా.. అభిమానులు మాత్రం వారిని మర్చిపోరు. అలాంటి నటుడే కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న బబ్లూ.

బబ్లూ టాలీవుడ్‌లో నటించింది తక్కువ సినిమాల్లోనే అయినా.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. ఆయన చేపిన కామెడీని మనసారా ఆస్వాదించారు. తన మార్క్‌ కామెడీతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం దర్శకుల్లో తేజ ముందు వరసలో ఉంటారు. బబ్లూని కూడా ఆయనే టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘చిత్రం’ సినిమా తో కమెడియన్ బబ్లు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో.. ఆ తర్వాత బబ్లూకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

తన కెరీర్‌లో అందరూ స్టార్‌ హీరోల సినిమాల్లో నటించారు బబ్లూ. కానీ స్టార్ కమెడియన్‌గా మాత్రం గుర్తింపు దక్కించుకోలేదు. ఇక బబ్లూ తన కెరీర్‌లో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్, మహేష్,రామ్ చరణ్ ఇలా అందరూ స్టార్ హీరోల సినిమాల్లోనూ ఆయన నటించారు. ఆయా సినిమాల్లో బబ్లు నటించిన సన్నివేశాలు, ఆయన మార్క్‌ కామెడీ అన్నీ విపరీతంగా పాపులర్ అవ్వడం విశేషం. వాస్తవంగా చెప్పాలంటే బబ్లూ కామెడీ టైమింగ్‌ కాస్త తక్కువే. కానీ ఆయన నటించిన సన్నివేశాల వలన బబ్లూ అందరికి గుర్తుండిపోయారు.

కొన్నాళ్ల పాటు వరుస సినిమాల్లో నటించిన బబ్లూ.. ఆ తర్వాత సినిమాలకు దూరం అ‍య్యారు. గత కొంతకాలంగా ఆయన ఏ సినిమాలో కనిపించలేదు. ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉంటున్నారు. మరి ప్రస్తుతం కమెడియన్ బబ్లు ఎక్కడ ఉన్నారు, ఏమి చేస్తున్నారు.. ఎందుకు ఇండస్ట్రీకి దూరం అయ్యారు అంటే.. తన కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైం లోనే బబ్లు తండ్రి మరణించారట. ఆయనకు తండ్రి అంటే చాలా ఇష్టం. తండ్రి మరణంతో ఆయన జీవితమే మారిపోయింది. ఆ బాధ నుంచి బయట పడటానికి ఆయనకు చాలా సమయం పట్టింది. అలాంటి సమయంలో సినిమాలు ఒప్పుకుంటే.. తన పాత్రకు న్యాయం చేయలేనని భావించి.. సినిమాలకు దూరంగా ఉంటున్నాడు బబ్లూ. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉంటున్నారు.. ఏం చేస్తున్నారు వంటి వివరాలు తెలియదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి