సినిమాలు అనేవి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడం వరకు ఓకే.. అలాగని ఎంటర్టైన్మెంట్ పేరుతో మతాల ప్రస్తావన తీసుకొస్తే ఎలాంటి విమర్శలు ఫేస్ చేయాల్సి వస్తుందో తెలిసిందే. ఎవరు.. ఏ భాషలో.. ఎలాంటి సినిమాలు తీసినా ఏ ఒక్కరి మనోభావాలకు భంగం కలగకుండా సినిమాలను తీసుకోవాలి. అంతగా మతాల ప్రస్తావన వస్తే.. అది పాజిటివ్ గా ఉండాలి గానీ ఏ మాత్రం తేడా కొట్టినా వరల్డ్ వైడ్ సినీ ప్రేమికులు తీవ్రమైన విమర్శలు గుప్పిస్తుంటారు. ఒక్కోసారి థియేటర్స్ నుండి సినిమాలు కూడా బ్యాన్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఆ రేంజ్ లో వ్యతిరేకత ఏర్పడితే సినిమా సంగతి అంతే. తాజాగా హాలీవుడ్ అగ్రదర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ఓపెన్ హైమర్’ మూవీకి ఇండియాలో అలాంటి పరిస్థితే నెలకొంది.
ఇటీవల వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాపై ఇండియాలో తీవ్రమైన నెగిటివిటీ విస్తరించింది. దానికి కారణం.. సినిమాలో ఒకే ఒక్క సీన్. సినిమాలోని ఓ బెడ్ సీన్ టైంలో భగవద్గీత శ్లోకాలు చదివించడం జరిగింది. దీంతో హిందువుల మనోభావాలు దెబ్బతీశారని హిందువుల నుండి విమర్శలు వెల్లువెత్తాయి. సినిమాని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. పవిత్ర గ్రంధమైన భగవద్గీతని అలాంటి సన్నివేశంలో చదవడం ఏంటి? ఈ ఒక్క సన్నివేశంలోనే కాదు.. సినిమాలో భగవద్గీత ప్రభావం చాలా చోట్ల కనిపిస్తుంది. దీంతో సోషల్ మీడియాలో డైరెక్టర్ నోలన్ ని ఆడేసుకుంటున్నారు.
అంతేగాక మీ మతానికి సంబంధించిన పుస్తకాల్ని అలాంటి సన్నివేశాల్లో చూపిస్తే ఊరుకుంటారా? పేరున్న దర్శకుడైతే ఇష్టాను సారం చేసేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వివాదం కాస్త కేంద్ర సమాచార శాఖ చెవిన పడింది. దీంతో సమాచార శాఖకు చెందిన కమిషనర్ ఉదయ్ మహుర్కర్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. వెంటనే సినిమాలో ఆ సీన్స్ తొలగించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నెటిజన్స్ డిమాండ్ కి.. కేంద్రం వార్నింగ్ కూడా తోడవ్వడంతో సినిమాపై విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. వెరసి.. ఎంతటి గొప్ప డైరెక్టర్స్ సినిమాలైనా ఇలాంటి సన్నివేశాలకు పాల్పడితే.. ఆ సినిమాలను ఇండియాలో రిలీజ్ చేయకూడదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఓపెన్ హైమర్ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
. @OppenheimerATOM
To,
Mr Christopher Nolan
Director , Oppenheimer filmDate : July 22, 2023
Reg: Film Oppenheimer’s disturbing attack on Hinduism
Dear Mr Christopher Nolan,
Namaste from Save Culture Save India Foundation.
It has come to our notice that the movie…
— Uday Mahurkar (@UdayMahurkar) July 22, 2023