iDreamPost
android-app
ios-app

ఢీ 11లో ఆమె ఎలిమినేట్ అయ్యాక.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపాడా?

  • Published Sep 19, 2024 | 5:55 PM Updated Updated Sep 19, 2024 | 5:55 PM

జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అతని వద్ద వర్క్ చేసిన లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడితో పరిచయం అయిన దగ్గర నుండి ప్రతి విషయాన్ని పోలీసుకు పూస గుచ్చినట్లుగా తెలిపింది. అయితే దీని వెనుక జానీ మాస్టర్ పెద్ద కథ నడిపినట్లు..

జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అతని వద్ద వర్క్ చేసిన లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడితో పరిచయం అయిన దగ్గర నుండి ప్రతి విషయాన్ని పోలీసుకు పూస గుచ్చినట్లుగా తెలిపింది. అయితే దీని వెనుక జానీ మాస్టర్ పెద్ద కథ నడిపినట్లు..

  • Published Sep 19, 2024 | 5:55 PMUpdated Sep 19, 2024 | 5:55 PM
ఢీ 11లో ఆమె ఎలిమినేట్ అయ్యాక.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపాడా?

జానీ మాస్టర్ పై వస్తున్న అత్యాచార ఆరోపణలపై టాలీవుడ్‌లో మాత్రమే కాదు యావత్ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్, కమిట్ మెంట్ ఉందంటూ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక పెను దుమారం రేగుతున్న వేళ.. ఇండియన్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు తెరపైకి వచ్చింది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అతని వద్ద వర్క్ చేసిన లేడీ డ్యాన్సర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబయి, చెన్నై అవుట్ డోర్ షూటింగ్స్ కోసం వెళ్లిన సమయంలో తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. సెట్స్‌లో కూడా తనను అసభ్యకరంగా తాకేవాడని పేర్కొంది. శారీరకంగా, మానసికంగా తనను హింసించాడని కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పట్టుకున్నారు.

అయితే బాధితురాలు చెబుతున్న దాని ప్రకారం చూస్తే.. ఢీ షోలో చేస్తున్నప్పటి నుండి ఆమెపై కన్నేశాడు జానీ మాస్టర్. ఎంతో ప్రీ ప్లాన్డ్‌గా తన టీంతో కలిసి కథ నడిపినట్లు తెలుస్తుంది. ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో ఢీలో పలు సీజనల్లో పార్టిసిపేట్ చేసింది బాధితురాలు. ఢీ 11లో బాగా ఎస్టాబ్లీష్ అయ్యింది. ఆ సమయంలోనే జడ్జిగా వచ్చాడు డ్యాన్స్ మాస్టర్ జానీ. అప్పడే ఆమెపై మనసు పారేసుకున్నాడు ఈ కొరియోగ్రాఫర్. ఢీ 11లో ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. తన టీంతో ఆమెతో టచ్‌లో ఉండేలా చేశాడు. ఆమెకు పలుమార్లు ఫోన్ చేసి, చేయించి.. తన టీంలో అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్‌గా చేరాలంటూ కోరాడు. అంతటి స్టార్ కొరియోగ్రాఫర్ అడిగితే కాదనలేక.. చివరకు 2019లో అతడి టీంలో చేరింది. ఇక అక్కడి నుండి తన కామ వాంఛను తీర్చుకోవడం మొదలు పెట్టాడు.

ప్లాన్డ్‌గా ఆమెను ఔట్ డోర్ షూటింగ్స్ కు తీసుకెళ్లడం స్టార్ట్ చేశాడు. అలా ముంబయి, చెన్నై ఔట్ డోర్ షూటింగ్స్‌కు తీసుకెళ్లినప్పుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. అక్కడితో ఆగిపోలేదు..క్యార్ వాన్‌లో సైతం తన కామ వాంఛ తీర్చాలంటూ ఇబ్బంది పెట్టాడు. కాదంటే.. షూటింగ్ సమయంలో కూడా ఆమెను అసభ్యంగా తాకుతూ ఇబ్బందికి గురి చేశాడు. అంతేకాదు సినిమాలో ఆఫర్స్ ఇస్తానంటూ..నువ్వే నా హీరోయిన్ అంటూ మభ్యపెట్టాడు. ఈ ఇద్దరు కలిసి సినిమా కూడా మొదలైంది. అలాగే సంచారి అనే సాంగ్‌లో కూడా నటించారు. దీనికి రజనీకాంత్ డాటర్ ఐశ్వర్య రజనీకాంత్ ప్రజెంటర్‌గా వ్యవహరించడం విశేషం. అలా ఆమెకు ఛాన్సులు అని చెప్పి.. మభ్యపెట్టి.. లొంగదీసుకుని, శారీరకంగా, మానసికంగా హింసకు గురిచేశాడు. లైంగిక దోపిడీ పాల్పడి.. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. చివరకు ఆమెను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె ప్రతిఘటించడంతో చివరకు పని లేకుండా చేసి భార్యతో కూడా భయపెట్టించాడు. ఇక తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobet günceldeneme bonusu veren sitelerjojobetMadridbetMadridbetJojobetnakitbahisJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişholiganbetjojobetjojobet girişjojobetbetcio