iDreamPost
android-app
ios-app

చిరంజీవిపై ఓ రేంజ్ లో పుకార్లు.. మరో వారంలో క్లారిటీ!

  • Author ajaykrishna Updated - 03:28 PM, Thu - 17 August 23
  • Author ajaykrishna Updated - 03:28 PM, Thu - 17 August 23
చిరంజీవిపై ఓ రేంజ్ లో పుకార్లు.. మరో వారంలో క్లారిటీ!

ఇటీవల విడుదలై ప్లాప్ టాక్ అందుకున్న భోళాశంకర్ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎన్నెన్ని పుకార్లు, విమర్శలు పుట్టుకొచ్చాయో తెలిసిందే. భోళాశంకర్ విషయంలో చిరంజీవి రెమ్యూనరేషన్ గురించి, ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గురించి, సినిమా డిస్ట్రిబ్యూటర్స్.. కలెక్షన్స్ గురించి ఇలా ఎన్నో కథనాలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా చిరంజీవి గురించి మరో వార్త వెలుగులోకి వచ్చింది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. కెరీర్ లోనే తీవ్రంగా నిరాశపరిచిన భోళాశంకర్ రిజల్ట్ తో చిరు హర్ట్ అయ్యారని, కొన్నాళ్ళు సినిమాలకు విరామం ఇవ్వాలని అనుకుంటున్నట్లు దాని సారాంశం.

అంతేగాక ఇవన్నీ డిసైడ్ అయ్యాకే.. చిరంజీవి తన మోకాలి సర్జరీ చేయించుకున్నారని కొన్ని కథనాలు చెబుతున్నాయి. అయితే.. చిరంజీవి సినిమాలకు గ్యాప్ తీసుకోవడం కొత్త కాదన్న విషయం విదితమే. గతంలో బిగ్ బాస్, రిక్షావోడు లాంటి ఫ్లాప్స్ పడినప్పుడు ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ సినిమాలు మొదలుపెట్టి.. 2007 వరకు సినిమాలు చేశారు. అనంతరం రాజకీయాల వలన మళ్లీ లాంగ్ గ్యాప్. కట్ చేస్తే.. 2017లో ‘ఖైదీ నెం 150’ మూవీతో రీఎంట్రీ. అక్కడినుండి వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది ఏకంగా రెండు సినిమాలు(వాల్తేరు వీరయ్య, భోళా శంకర్) రిలీజ్ చేశారు. కానీ.. భోళా శంకర్ ఇచ్చిన షాక్ తో మళ్ళీ బ్రేక్ పడినట్లు అయ్యిందని టాక్.

ఇదిలా ఉండగా.. ఈ వార్తలలో నిజమెంత అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు ప్రచారంలో ఉన్న రూమర్స్ పైన క్లారిటీ రావాలంటే.. కొద్దిరోజులలో రాబోతున్న మెగాస్టార్ బర్త్ డే వరకు ఆగాల్సిందే. ఎందుకంటే.. ఆ రోజే మెగాస్టార్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. సో.. కొత్త సినిమా అనౌన్స్ చేస్తే.. ఆయన గురించి వస్తున్న వార్తలపై స్పష్టత రానుందని సమాచారం. ప్రస్తుతం చిరంజీవి చేతిలో రెండు సినిమాలున్నాయి. కళ్యాణ్ కృష్ణ తో ఒకటి.. యూవి క్రియేషన్స్ బ్యానర్ లో మరో సినిమా. ఈ రెండిట్లో ఏ సినిమా సెట్స్ పైకి వెళ్లాలన్నా.. ముందుగా రూమర్స్ కి చెక్ పెట్టాల్సి ఉంది. సో.. మెగాస్టార్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/