iDreamPost
android-app
ios-app

Vishwambhara Movie: హిట్లర్ తర్వాత మళ్ళీ విశ్వంభరే

  • Published Mar 06, 2024 | 7:57 AM Updated Updated Mar 06, 2024 | 7:57 AM

చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం విశ్వంభర. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త.. ఫిల్మ్‌ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. ఆ వివరాలు..

చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం విశ్వంభర. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త.. ఫిల్మ్‌ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. ఆ వివరాలు..

  • Published Mar 06, 2024 | 7:57 AMUpdated Mar 06, 2024 | 7:57 AM
Vishwambhara Movie: హిట్లర్ తర్వాత మళ్ళీ విశ్వంభరే

మెగాస్టార్ చిరంజీవి సరసన నటించడానికి ఎవ్వరైనా సిద్ధపడతారు. లేదా ఇష్టపడతారు. కానీ ఆ పాత్రల ఔచిత్యం బట్టి కొన్ని సార్లు దానికి సూటయ్యే నటిని ఎంపిక చేయడం మాత్రం గగనమైపోతుంది. ఇది చాలా సందర్భాలలో మెగాస్టార్ విషయంలో జరిగింది. 1997లో వచ్చిన హిట్లర్ సినిమాలో ఆయన చెలెళ్ళుగా ఆర్టిస్టల్ని సెలెక్ట్ చేయడానికి ఎంతో కాలం పట్టింది. చాలా మందిని అనుకుని అందులో కరెక్టు అనుకున్న కొంతమంది టీవి సీరియల్ నటీమణులను తెరమీదకి తీసుకొచ్చారు.

రిక్షావాడు సినిమా తర్వాత కావాలనే 9 నెలల గ్యాప్ తీసుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఎంపిక చేసుకున్న కథ హిట్లర్. అది మళయాళం రీమేక్. ఆయన సినిమా కోసం ముఖం వాచిపోయి ఉన్న ఆడియన్స్ హిట్లర్ సినిమాని బంపర్ హిట్ చేశారు. కుటుంబకథా చిత్రాలకు పేరుపడ్డ ముత్యాల సుబ్బయ్య మెగాస్టార్ తో చేయడం అదే ప్రథమం. తర్వాత మళ్ళీ గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద చేసిన అన్నయ్య ముత్యాల సుబ్బయ్యకి రెండో సినిమా.

Vishwambharare again after Hitler

రిక్షవాడు సినిమాలో కూడా నగ్మా ఫాదర్ గా ఎవరిని పెట్టాలని మల్లగుల్లాలు పడ్డారు. చివరికి పరేష్ రావల్ ఆ ఛాన్స్ కొట్టేశాడు. అందులోనే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిన పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ మెగాస్టార్ కనిపించినప్పుడు భార్యగా జయసుథని ఎంపిక చేయడానికి కూడా కొంత టైం పట్టింది. అన్నయ్య సినిమాలో ఆయన బ్రదర్స్ వేషాలు ఎవరికి అంటే చాలా సెర్చ్ జరిగింది. జెడి చక్రవర్తిని కూడా అనుకున్నారు. కానీ ఏ కారణాలగానో చక్రి ఆ ఆఫర్ని రిసీవ్ చేసుకోలేదు. తర్వాత కొన్నాళ్ళకి ఇప్పటి మాస్ మహరాజా రవితేజ, వెంకట్ ఆ ఛాన్స్ లను అందిపుచ్చుకున్నారు.

మొన్నీ మధ్యన వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో కూడా నయనతార చేసిన క్యారెక్టర్ కి చాలా పేర్లు వినిపించాయి. అందులో త్రిష కూడా ఉంది. మొత్తానికి నయనతారనే ఆ అవకాశం వరించింది. హీరోయిన్ గా చేసిన తర్వాత అటువంటి క్యారెక్టర్లో కనిపించడానికి త్రిష సుముఖత వ్యక్తం చేయలేదుట.

మెగాస్టార్ చిరంజీవిపైన ఉన్న భారీ అంచనాలు, ఆ బడ్జెట్లు అంత తొందరగా ఎవరిని పడితే వారిని ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి అనుమతించవు. అదే ఇప్పుడు విశ్వంభర చిత్రంలో కూడా ఎదురైంది. రకరకాల పేర్లు వినిపించాయి మొదట్లో. అందులో మ్రిణాల్ ఠాకూర్, మీనాక్షి చౌదరి పేర్లు కొంత సందడి చేశాయి. కానీ తాజాగా సురభి, ఈషా చావ్లా, ఇన్స్టా ప్లాట్ పారం మీద బాగా పాప్యులర్ అయిన రమ్య పసుపులేటితో పాటు మరికొందరు పరిశీలనలో ఉన్నట్టుగా యూనిట్ సభ్యలు చెబుతున్నారు.

అవకాశాల కోసం ఆరాటపడుతున్న మెరిట్ అండ్ ప్రీవియస్ గా కొన్ని హిట్లని సొంతం చేసుకున్నవారి వేటలో ప్రస్తుతం విశ్వంభర డైరెక్టర్ వశిష్ట పడ్డాడు. 2025 సంక్రాంతి బరిలోకి ఉరకబోతున్న విశ్వంభర షూటింగ్ కార్యక్రమాలు మాత్రం శరవేగంతో జరుగుతున్నాయి. ఈ ఆర్టిస్టులు కూడా ఫైనల్ అయిపోతే, ఇంక పరుగేపరుగు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet