iDreamPost
android-app
ios-app

విశ్వంభర నలుగురు హీరోయిన్స్ ఫిక్స్! బాస్ మెచ్చిన బ్యూటీలు వీరే!

  • Published Feb 06, 2024 | 7:44 PM Updated Updated Feb 06, 2024 | 7:44 PM

Chirajneevi Vishwambhara Movie: చిరంజీవి- వశిష్ఠ కాంబోలో వస్తున్న విశ్వంభరపై ఒక క్రేజీ అప్ డేట్ వైరల్ అవుతోంది. ఆ మూవీలో చేసే నలుగురు హీరోయన్స్ ఎవరో చూడండి.

Chirajneevi Vishwambhara Movie: చిరంజీవి- వశిష్ఠ కాంబోలో వస్తున్న విశ్వంభరపై ఒక క్రేజీ అప్ డేట్ వైరల్ అవుతోంది. ఆ మూవీలో చేసే నలుగురు హీరోయన్స్ ఎవరో చూడండి.

  • Published Feb 06, 2024 | 7:44 PMUpdated Feb 06, 2024 | 7:44 PM
విశ్వంభర నలుగురు హీరోయిన్స్ ఫిక్స్! బాస్ మెచ్చిన బ్యూటీలు వీరే!

మెగాస్టార్ ఫ్యాన్స్ ప్రస్తుతం చిరంజీవికి పద్మ విభూషణ్ దక్కడంపై ఆనందంగా ఉన్నారు. యావత్ దేశం చిరుకి పద్మ విభూషణ్ రావడంపై ప్రసంశల వర్షం కురిపించింది. ఇండస్ట్రీ మొత్త స్వయంగా చిరంజీవికి ఇంటికి ఆయన్ని అభినందిస్తోంది. మరోవైపు చిరంజీవి మళ్లీ సినిమాల జోరు పెంచేశారు. ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా విశ్వంభర చిత్రంపైనే ఉంది. ఈ మూవీని మెగాస్టార్ కెరీర్ లోనే టాప్ 3 చిత్రాల్లో ఒకటిగా ఉంచుతాను అంటూ డైరెక్టర్ వశిష్ఠ చెప్పడం చూశాం. అప్పటి నుంచే ఈ మూవీపై హైప్ విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ కూడా అంచనాలను పెంచేస్తోంది. పైగా ఈ మూవీలో మొత్తం 4 హీరోయిన్స్ మెరుస్తారని అందరికీ తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి– శ్రీదేవి జంటగా చేసిన జగదేకవీరుడు అతిలోక సుందరి అనే సోషియో ఫాంటసీ చిత్రానికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి ఒక మూవీ చేసి చాలారోజులు అవుతోంది. ఇప్పుడు బింబిసార డైరెక్టర్ వశిష్ఠతో మెగాస్టార్ చిరంజీవి ఒక సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు అనగానే అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పైగా ఆ మూవీ నుంచి వస్తున్న అప్ డేట్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉన్నాయి. టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసినప్పుడు ఒక కంప్లీట్ వేరే ప్రపంచానికి తీసుకెళ్తారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. పంచభూతాల రిఫరెన్సులు ఉండేలా చూపించారు. ఇంక ఈ మూవీలో నలుగురు హీరోయిన్స్ ఉంటారు అనే విషయాన్ని చాలారోజుల క్రితమే అనౌన్స్ చేశారు.

విశ్వంభరలో నటించే ఆ నలుగురు హీరోయిన్స్ ఎవరు అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. కానీ, ఇప్పుడు ఇండస్ట్రీలో కొన్నిపేర్లు వైరల్ అవతున్నాయి. దాదాపుగా ఆ లిస్టే ఖరారు కూడా అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నలుగురు హీరోయిన్స్ లో ఇప్పటికే త్రిష పేరుని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో చిరంజీవికి వ్యతిరేకంగా త్రిష నెగిటివ్ రోల్ లో కనిపించబోతోంది అంటున్నారు. అయితే ఇంకా ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. వాళ్లు ఎవరు అంటే.. మీనాక్షి చౌదరి, తమన్నా, శ్రీలీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. త్రిష కాకుండా ఈ ముగ్గురు భామలే విశ్వంభర చిత్రంలో మెరుస్తారంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఈ ముగ్గురు హీరోయిన్స్ విశ్వంలో ఉన్న వేరే వేరే ప్రపంచాల నుంచి దేవ కన్యల్లా భూమి మీదకు వస్తారంటూ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవితో మీనాక్షి చౌదరి, తమన్నా, శ్రీలలకు సీన్స్ కూడా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. అయితే వీరి మధ్య ఎలాంటి రొమాంటిక్ సీన్స్ మాత్రం ఉండవని క్లారిటీ ఇస్తున్నారు. ఇంక విశ్వంభర షూటింగ్ లో ఇటీవలే చిరంజీవి కూడా పాల్గొన్నారు. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ అయితే జరుగుతోంది. విశ్వంభర చిత్రం కోసం వశిష్ఠ కంప్లీట్ గా వేరే ప్రపంచాన్ని డిజైన్ చేస్తున్నట్లు, వీఎఫ్ఎక్స్ ఈ మూవీలో కీలకపాత్ర పోషిస్తాయని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. మరి.. విశ్వంభరలో తమన్నా, శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio