Chiranjeevi,Harish Shankar Movie: హరీష్ శంకర్ పంట పండినట్లేనా! ఈసారి మెగాస్టార్ చిరుతో..

హరీష్ శంకర్ పంట పండినట్లేనా! ఈసారి మెగాస్టార్ చిరుతో..

Chiranjeevi,Harish Shankar Movie: ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా కూడా మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ మాత్రం.. ఎప్పటికి అలానే ఉంటుంది. ప్రస్తుతం విశ్వంభర చిత్రంతో బిజీగా ఉన్నారు చిరు. ఈ క్రమంలో ఆయన నెక్ట్ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Chiranjeevi,Harish Shankar Movie: ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా కూడా మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ మాత్రం.. ఎప్పటికి అలానే ఉంటుంది. ప్రస్తుతం విశ్వంభర చిత్రంతో బిజీగా ఉన్నారు చిరు. ఈ క్రమంలో ఆయన నెక్ట్ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అప్పటికి ఇప్పటికి మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఉండే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికి చిరంజీవి నుంచి ఓ సినిమా వస్తుందంటే.. ఆ మూవీ అనౌన్స్ చేసినప్పటినుంచే హైప్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం చిరు వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటూ.. ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉండే హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పటికే చిరు విశ్వంభర చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే.. మెగాస్టార్ నెక్ట్ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. మరి ఈ సారి చిరు ఏ డైరెక్టర్ తో జత కట్టనున్నారనే విషయాలు చూసేద్దాం.

చిరంజీవి.. బి.వి.ఎస్ రవి రెడీ చేసిన స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆల్రెడీ ఇప్పటికే ఎన్నో హిట్ చిత్రాలకు స్క్రీన్ రైటర్ , డైలాగ్ రైటర్ గా వర్క్ చేసిన బి.వి.ఎస్ రవి.. ఇప్పుడు చిరు కోసం ఓ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ రెడీ చేశారట. ఈ సినిమా స్టోరీ చిరుకు కూడా నచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. కాగా ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సుస్మిత కొణిదెల.. హౌస్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ తో కలిసి నిర్మించనున్నారట. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం హరీష్ శంకర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో .. రవి తేజ మిస్టర్ బచ్చన్ మూవీని డైరక్ట్ చేశారు. ఆగష్టు 15న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే.. హరీష్ చిరుతో మూవీపై క్లారిటీ ఇచ్చారు.

చిరంజీవికి కథ చెప్పడం జరిగిందని.. ఆయనకు కూడా స్టోరీ బాగా నచ్చిందని.. త్వరలోనే స్వయంగా చిరు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్సుమెంట్ ఇస్తారంటూ.. హరీష్ చెప్పుకొచ్చారు. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ ఉండబోతున్నట్లు ఎప్పటినుంచో టాక్ వినిపిస్తున్నా కానీ.. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇక ఆ తర్వాత హరీష్ ఉస్తాద్ మూవీ ప్రాజెక్ట్ లో జాయిన్ అవ్వనున్నాడు. ఈలోపు చిరంజీవి విశ్వంభర మూవీ కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి.. వెంటనే చిరు , హరీష్ శంకర్ మూవీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. మరి వీరిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేస్తారో వేచి చూడాలి. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments