iDreamPost
android-app
ios-app

Chiranjeevi: చిరంజీవి ఎమోషనల్.. తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ..

  • Published Jan 29, 2024 | 7:55 PM Updated Updated Jan 29, 2024 | 7:55 PM

చిరంజీవికి తల్లిపై ఉండే అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా ఆ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు.

చిరంజీవికి తల్లిపై ఉండే అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా ఆ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు.

  • Published Jan 29, 2024 | 7:55 PMUpdated Jan 29, 2024 | 7:55 PM
Chiranjeevi: చిరంజీవి ఎమోషనల్.. తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ..

మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు మారుమోగుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ఓ అరుదైన ఘనతను సాధించారు. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం అయిన పద్మ విభూషణ్ ఆయనను వరించింది. ఇప్పటికే పద్మశ్రీ, పద్మ భూషణ్ అందుకున్న మెగాస్టార్ కు పద్మ విభూషణ్ దక్కడంతో టాలీవుడ్ మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు టాలీవుడ్ నుంచి ఈ ఘనత సాధించింది కేవలం అక్కినేని నాగేశ్వరరావు మాత్రమే. ఆయన తర్వాత పద్మ విభూషణ్ దక్కించుకున్న నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు. ఈ మధుర క్షణాల్లోనే చిరంజీవికి ఇంకో ప్రత్యేకమైన రోజు కూడా వచ్చింది. అదే ఆయన తల్లి పుట్టినరోజు. తల్లి అంజనాదేవి పుట్టినరోజుని చిరంజీవి మరింత ప్రత్యేకంగా మార్చారు. అందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తన మాతృమూర్తి అంజనాదేవి జన్మదినాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేశారు. ఫ్యామిలీతో కలిసి ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తల్లితో కేక్ కట్ చేయించారు. ఆ మధుర క్షణాలను తన అభిమానులతో కూడా కలిసి పంచుకున్నారు. అలాగే ఆ ఫొటోలకు ఒక ఎమోషనల్ క్యాప్షన్ కూడా పెట్టారు. “కనిపించే దేవత, కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు” అంటూ చిరంజీవి ఎమోషనల్ క్యాప్షన్ కూడా పెట్టారు. తల్లిపై చిరంజీవికి ఉండే అభిమానం, ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫొటోలు చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్ కూడా అంజనా దేవికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. మరి.. మీరు కూడా కామెంట్స్ రూపంలో చిరంజీవి తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş