iDreamPost
android-app
ios-app

అందరివాడు మూవీ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందంటే..?

  • Published Aug 22, 2024 | 6:58 PM Updated Updated Aug 22, 2024 | 6:58 PM

చిరంజీవి- శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన మూవీ అందరి వాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించారు. చిన్న చిరుకి హీరోయిన్ గా నటించిన యాక్ట్రెస్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

చిరంజీవి- శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన మూవీ అందరి వాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించారు. చిన్న చిరుకి హీరోయిన్ గా నటించిన యాక్ట్రెస్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

  • Published Aug 22, 2024 | 6:58 PMUpdated Aug 22, 2024 | 6:58 PM
అందరివాడు మూవీ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందంటే..?

మెగాస్టార్ చిరంజీవి డ్యూయల్ రోల్ చేసిన చిత్రాల్లో ఒకటి అందరి వాడు. వర్సటైల్ డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీ 2005లో విడుదలైంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించాడు. ఇందులో చిరు తండ్రీ, కొడుకులుగా నటించాడు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటించారు. టబు, రిమీ సేన్ అండ్ ఇడియట్ బ్యూటీ రక్షిత. తండ్రికి జోడిగా టబు నటిస్తే.. కొడుకుకు హీరోయిన్‌గా రిమీసేన్ కనిపిస్తుంది. ఇందులో తండ్రీ కొడుకులను విడదీసేందుకు కోడలిగా ఇంట్లోకి అడుగుపెట్టి కుట్రలు, కుతంత్రాలు చేస్తుంది. బ్రదర్ సునీల్‌తో కలిసి ప్లాన్ వేస్తూ ఉంటుంది. వాటిని తిప్పి కొడుతుంటాడు మామ గోవిందు. ఈ మూవీలో సీనియర్ నటి టబు కన్నా.. ఈ యంగ్ బ్యూటీకే స్కోప్ ఎక్కువ ఇచ్చాడు డైరెక్టర్. చిరు పక్కన కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడెలా ఉందంటే..? ఆమె కెరీర్ ఎలా సాగిందంటే..?

రిమీ సేన్ అసలు పేరు శుభమిత్ర సేన్. ఆమె బెంగాలీ బ్యూటీ. ఆమె విద్యాభ్యాసం కోల్ కతాలో సాగింది. చిన్నప్పటి నుండే యాక్టర్ కావాలనుకుంది రిమీ. చదువులు పూర్తయ్యాక తల్లిని ఒప్పించి ముంబయి వెళ్లింది. అలా అమీర్ ఖాన్‌తో ఓ యాడ్‌లో నటించే అవకాశాన్ని కొల్లగొట్టింది. ఈ యాడ్ తర్వాత ఆమెకు హిందీ అవకాశాలను తెచ్చిపెట్టలేదు కానీ బెంగాలీ, తెలుగులో మాత్రం ఆఫర్స్ వచ్చాయి. బెంగాలీలో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమెకు తెలుగులో ఇదే నా మొదటి ప్రేమ లేఖ, నీ తోడు కావాలి మూవీల్లో ఛాన్సులు వచ్చాయి. ఈ చిత్రాల జయపజయాలు ఎలా ఉన్నా.. ఆమె ఆశించిన విధంగా హిందీ ఇండస్ట్రీలో ఛాన్సులు స్టార్ట్ అయ్యాయి. హంగామాతో పాటు ధూమ్ చిత్రాల్లో నటించాక.. అప్పుడు అందరి వాడు మూవీ ఆఫర్ వస్తే .. తిరిగి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటరయ్యింది.

కానీ ఆమె టాలీవుడ్‌లో కెరీర్ కొనసాగించలేదు. వరుస పెట్టి హిందీలోనే చిత్రాలు చేసి స్టార్ట్ డమ్ తెచ్చుకుంది. గరమ్ మసాలా, గోల్ మాల్ ఫన్ అన్ లిమిటెడ్, ధూమ్ 2, హార్న్ ఓకే ప్లీజ్, థాంక్యూ చేసింది. 2015లో హిందీ బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగుపెట్టింది ఈ బెంగాలీ ముద్దుగుమ్మ. ఏడు వారాల పాటు ఇంట్లో అలరించి బయటకు వచ్చింది. 2016లో నిర్మాతగా మారి బుధియా సింగ్ అనే సినిమాను తెరకెక్కించింది. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. తన వాహనానికి మోటారు సర్వీసు సరిగా చేయకుండా తనకు ఇబ్బంది పెట్టినందుకు ఓ కార్ల కంపెనీపై దావా వేసింది. తనకు కలిగిన నష్టానికి రూ. 50 కోట్లు చెల్లించాలంటూ దావా వేసింది ఈ బ్యూటీ.

 

View this post on Instagram

 

A post shared by Rimi Sen (@subhamitra03)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet