iDreamPost
android-app
ios-app

ప్రతీకారం తీర్చుకునే ‘చిన్ని’ గా కీర్తి సురేష్

  • Published Apr 22, 2022 | 1:06 PM Updated Updated Apr 22, 2022 | 1:07 PM
  • Published Apr 22, 2022 | 1:06 PMUpdated Apr 22, 2022 | 1:07 PM
ప్రతీకారం తీర్చుకునే ‘చిన్ని’ గా కీర్తి సురేష్

మహానటితో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కీర్తి సురేష్ కొత్త సినిమా చిన్ని డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అందుకోనుంది. తమిళంలో సాని కడియం టైటిల్ తో రూపొందిన ఈ రివెంజ్ డ్రామాకు అరుణ్ మహదేశ్వరన్ దర్శకుడు. విజయ్ బీస్ట్ లో కీలక పాత్రలో కనిపించిన కల్ట్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ ఇందులో ఓ ముఖ్య పాత్ర చేయడం విశేషం. లాక్ డౌన్ టైంలో దీని షూటింగ్ వేగంగా పూర్తి చేశారు. మిగిలిన పాత్రలు ఎవరు పోషించారనేది టీజర్ లో చూపించలేదు. తన జీవితాన్ని నాశనం చేసిన చిన్ని అనే అమ్మాయి నిందితులకు జైలు శిక్ష పడితే సంతృప్తి చెందదు. అంతకు మించి వాళ్లకు జరగాలని కోరుకుని తనే దానికి పూనుకుంటుంది.

పాయింట్ సింపుల్ గానే ఉంది. మేకప్, బొట్టు ఏమి లేకుండా కీర్తి సురేష్ చాలా డీ గ్లామర్డ్ గా కనిపించడం విశేషం. టీజర్ లో తను చెప్పే డైలాగులు తప్ప మిగిలిన విజువల్స్ అంతగా రివీల్ చేయలేదు. కేవలం ఒక మనిషిని సజీవంగా దహనం చేయడం మాత్రం చూపించారు. కానీ అసలు కథ వేరే ఉంది. చిన్ని(కీర్తి సురేష్) కానిస్టేబుల్ గా పని చేస్తూ ఉంటుంది. భర్త కూలీపని చేస్తూ అండగా ఉంటాడు. స్థానిక రాజకీయ కుట్రల వల్ల అతను, ఆ దంపతుల ఐదేళ్ల కూతురు ఇద్దరూ దారుణంగా హత్యకు గురై సజీవ దహనం చేయబడతారు. కానీ కోర్టులో న్యాయం జరగదు. దీంతో సోదరుడు(సెల్వ రాఘవన్)తో కలిసి చిన్ని ప్రతీకారాన్ని తెగబడుతుంది.

ఇలాంటి థీమ్ తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. మరి కీర్తి సురేష్ కి అంత ప్రత్యేకంగా ఇందులో ఏం నచ్చిందో అసలు కంటెంట్ చూశాక క్లారిటీ వస్తుంది. పెంగ్విన్, మిస్ ఇండియా రెండు ఓటిటి డిజాస్టర్లు కీర్తి సురేష్ ఖాతాలో ఉన్నాయి. థియేటర్ లో రిలీజ్ చేసిన గుడ్ లక్ సఖి దారుణంగా రిజెక్ట్ చేయబడింది. మరి ఈ చిన్ని ఏమైనా అద్భుతాలు చేస్తుందేమో చూడాలి. డిఫరెంట్ టోన్ లో ప్లాట్ ని సెట్ చేసినట్టు తెలుస్తోంది. సర్కారు వారి పాట విడుదలకు సరిగ్గా వారం రోజులు ముందు వస్తున్న ఈ చిన్ని తనకు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో. అసలే కీర్తి సురేష్ కు ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టులు కలిసి రావడం లేదు మహానటి తప్ప.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom