iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో పాన్ ఇండియా రేంజ్ స్టార్ హీరో ఉన్నాడు! ఎవరో గుర్తుపట్టారా..?.

  • Author ajaykrishna Updated - 04:21 PM, Mon - 14 August 23
  • Author ajaykrishna Updated - 04:21 PM, Mon - 14 August 23
ఈ ఫోటోలో పాన్ ఇండియా రేంజ్ స్టార్ హీరో ఉన్నాడు! ఎవరో గుర్తుపట్టారా..?.

ఇండస్ట్రీలో హీరోలైనా.. హీరోయిన్స్ అయినా ఫ్యాన్స్ కి బాగా దగ్గరవ్వడానికి రెండు కారణాలు ప్రధానంగా వినిపిస్తుంటాయి. ఒకటి వారు ప్రెజెంట్ లుక్ లో ఎలా ఉన్నారు? ఎలాంటి స్టార్డమ్ అనుభవిస్తున్నారు.. ఒక స్టేజ్ కి ఎదిగాక ఎలాంటి సినిమాలు చేస్తున్నారు? అనేది చూసి ఫ్యాన్స్ అయిపోతారు. రెండోది వారి పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఏదైనా విషయాలు నచ్చితే.. వాటికీ ఫ్యాన్స్ కనెక్ట్ అయితే ఆ అభిమానాన్ని ఎవరూ ఆపలేరు. అలాంటి పర్సనల్ విషయాలు ఏముంటాయి? అనంటే.. వారి చిన్నతనంలో చేసిన పనులు.. లేదా ఆనాటి మెమోరీస్ కి కూడా కనెక్ట్ అయ్యే ఫ్యాన్స్ ఉంటారు. మీరు పైన ఫోటోలో గమనిస్తే ఓ స్టార్ హీరో నవ్వుతూ కనిపిస్తున్నాడు.

ఇప్పుడు అతను ఎవరో గుర్తు పట్టగలరా? బాగా గమనిస్తే కనిపెట్టడం కష్టమేమి కాదు. ఎందుకంటే.. ఆ హీరో సౌత్ ఆడియన్స్ కి కూడా బాగా సుపరిచితుడు. అదేంటి సౌత్ అని సపరేట్ గా మెన్షన్ చేస్తున్నారు. అంటే.. అతను సౌత్ స్టార్ కాదా? అని మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్ రావడంలో తప్పు లేదు. ఎందుకంటే.. పాన్ ఇండియా అనే పదం ఫేమ్ లోకి రాకముందు అతను బాలీవుడ్ లో స్టార్. టాలీవుడ్ నుండి సూపర్ హిట్ సినిమాలు రీమేక్ చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఇలా క్లూ ఇచ్చేశారు.. అయినా గుర్తు రాట్లేదు అనిపిస్తే.. మరో క్లూ. ఈ ఏడాది ఓ టాలీవుడ్ మూవీలో క్యామియో ఎంట్రీ కూడా చేశాడు. ముఖ్యంగా ఇతని ఎంట్రీకి థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి.

ఆ ఇప్పుడు గుర్తుకు వచ్చింది.. అని మీ మైండ్ లో ఓ ఆలోచన రావచ్చు. కానీ.. నేను చెప్పిన టాలీవుడ్ మూవీ ఏంటో తెలుసా? అసలే ఈ మధ్య చాలామంది బాలీవుడ్ స్టార్స్ సౌత్ లో సినిమాలు చేస్తున్నారు. అలాగంటే కష్టమే అనుకుంటున్నారా..! సరే చెప్పేస్తున్నా. ఆ హీరో ఎవరంటే కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఫోటోలో అందరికంటే హైట్ ఉండి.. ఒక పిల్లాడు నవ్వుతున్నాడు కదా! ఆ పిల్లాడే సల్మాన్. ఆల్రెడీ బాలీవుడ్ లో స్టార్ అయినప్పటికీ.. తెలుగు నుండి రీమేక్ చేసిన పోకిరి, కిక్ సినిమాలు.. ఆయన కెరీర్ లో కీలకపాత్ర పోషించాయి. ఇక సల్మాన్ తెలుగు సినిమాలో క్యామియో రోల్ చేసింది.. మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ మూవీలో. ఇప్పుడు గుర్తొచ్చిందిగా! మరి ఈ స్టార్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş