iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఓ స్టార్ హీరోయిన్! అలాగే స్టార్ హీరోకి భార్య కూడా.. గుర్తుపట్టారా?

  • Author ajaykrishna Published - 03:31 PM, Fri - 14 July 23
  • Author ajaykrishna Published - 03:31 PM, Fri - 14 July 23
ఈ చిన్నారి ఓ స్టార్ హీరోయిన్! అలాగే స్టార్ హీరోకి భార్య కూడా.. గుర్తుపట్టారా?

ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి సక్సెస్ అయ్యేవారు ఓ రకమైతే.. తల్లిదండ్రులకు వారసత్వంగా వచ్చేవారు ఇంకొందరు. వారసులుగా వచ్చినప్పటికి.. సక్సెస్ అనేది సొంతంగా సాధించాల్సి ఉంటుంది. ఈ విషయం ఎవరికైనా వర్తిస్తుంది. అయితే.. మీరు ఇప్పుడు పైన ఫోటోలో చూస్తున్న చిన్నారి.. చాలా క్యూట్ గా ఉంది కదా! తానిప్పుడు స్టార్ హీరోయిన్ కూడా. కానీ.. ఇండస్ట్రీలోని తన తండ్రి పేరుతో వచ్చింది. ఆమె తండ్రి పేరున్న దర్శకుడు. అలాగని ఈ భామ తండ్రి పేరునే ఇప్పటిదాకా తగిలించుకుందని అనుకోకండి. జస్ట్ ఎంట్రీ కోసం తండ్రి ఫేమ్ అవసరం అయ్యింది అంతే. తర్వాత తన సొంతంగా కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేసింది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొంతకాలనికే సక్సెస్ లు అందుకుంది. మెల్లగా ఒక్కో యంగ్ హీరోతో పాటు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసి.. స్టార్డమ్ సంపాదించుకుంది. పైగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి కూడా అమ్మడికి మంచి పేరుంది. ఎవరో గుర్తు పట్టారా? చాలా క్లూస్ ఇచ్చాను.. కానీ, ఎక్కడ బలమైన క్లూ ఇవ్వలేదు అనే ఫీలింగ్ ఉందా! సరే ఇప్పుడు ఇస్తా బలమైన క్లూ. అదేంటంటే.. ఈ భామ స్టార్ హీరోయిన్ అయ్యాక.. తెలుగులో కూడా డెబ్యూ చేసింది. చిన్న పాత్రే అయినా.. బిగ్ సక్సెస్ ఖాతాలో వేసుకుంది. అంతేగాక తెలుగులో డెబ్యూ చేసిన ఏడాది.. ఓ స్టార్ హీరోని పెళ్ళాడింది. అదికూడా లవ్ మ్యారేజ్.

ఈపాటికి గుర్తుకు వచ్చి ఉండాలే.. అయినా రాలేదంటే ఇంకో క్లూ.. ఈ భామ పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. ఏంటి షాకింగ్ గా ఉందా.. కానీ ఇదే నిజం. ఆ నిజం లేట్ అయితే ఏకంగా బిడ్డను ఎత్తుకొని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని.. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కొద్దిరోజులకే హీరోని పెళ్ళాడింది. ఆ హీరో కూడా సినీ ఫ్యామిలీకి చెందినవాడే. వయసులో చాలా పెద్దవాడు కూడా. పైగా వీరిద్దరూ కలిసి నటించిన సినిమా గతేడాది పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. దాని ఫలితం గురించి పక్కన పెడితే.. ఆ సినిమా మూడు భాగాలుగా రాబోతుంది. హ.. ఇప్పుడు తెలిసిపోయింది కదా! ఆ భామ ఎవరో కాదు.. అలియా భట్. ఏంటి ఇప్పటిదాకా ఊరించింది బాలీవుడ్ హీరోయిన్ గురించా అనుకోకండి. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న స్టార్ ఈ భామ. రణబీర్ కపూర్ కి భార్య. ప్రస్తుతం అలియా చిన్ననాటి పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ చిన్నారి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişrekabet girişgrandpashabet