iDreamPost
android-app
ios-app

ఈ క్యూట్ పాపను గుర్తుపట్టారా..? తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది!

  • Author ajaykrishna Updated - 04:43 PM, Tue - 8 August 23
  • Author ajaykrishna Updated - 04:43 PM, Tue - 8 August 23
ఈ క్యూట్ పాపను గుర్తుపట్టారా..? తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది!

ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించడం అంటే మామూలు విషయం కాదు. అందరికీ సాధ్యం కాదు. కానీ.. కొందరికి ఆ లక్ బాగా వర్కౌట్ అవుతుంది. అలా వర్కౌట్ అయినవారు కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకున్నారు? అనేది పాయింట్. మీరు ఇప్పుడు పైన ఫోటోలో చూస్తున్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడిప్పుడే స్టార్ స్టేటస్ అందుకునే ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో డెబ్యూ మూవీతోనే యూత్ కి మోస్ట్ ఫేవరేట్ అయిపోయింది.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేసింది. ఎవరో గుర్తొచ్చిందా? యూత్ అంటున్నారు.. ఫ్యామిలీ ఆడియన్స్ అంటున్నారు.. ఈ మధ్యకాలంలో అంతలా కదిలించిన సినిమాలు ఏం వచ్చాయబ్బ! అనుకుంటున్నారా..

ఈ మధ్య కాదు.. కొంత వెనక్కి వెళ్ళాలి. మరి వెనక్కి కాదు ఓ ఏడాది వెనక్కి వెళ్తే సరిపోతుంది. పూర్తిగా మాస్ యాక్షన్ సినిమాలతో దూసుకుపోతున్న ఇండస్ట్రీ.. ఒక్కసారిగా చల్లని వాన చినుకులా ఓ సినిమా వచ్చింది. ఎమోషన్స్ తో అందరి గుండెలను పిండేసింది.. అంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమాలో బ్యూటీనే.. ఇప్పుడు మీరు పైన పిక్ లో చూస్తున్న చిన్నారి. ఫోటోలో అంటే.. చిన్నప్పుడు ఇంత క్యూట్ గా ఉంది. మరి ఇప్పుడు హీరోయిన్ అయ్యాక కూడా అలాగే ఉందా? అనంటే.. ఓ రకంగా ట్రడిషనల్, మోడరన్ రెండు కలిపి మెయింటైన్ చేస్తోంది. ఖచ్చితంగా తనను డెబ్యూ మూవీలో చూశాక.. అరెరే చాలా ఏళ్ల తర్వాత ఒక తెలుగుదనం ఉట్టిపడుతున్న అందం చూశామనే ఫీల్ కలిగించింది.

 

ఇప్పటికైనా గుర్తొచ్చిందా.. ఇంకో క్లూ ఇస్తా! ఈ బ్యూటీ తెలుగు ఒక్క సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది. కానీ.. ఆమె తెలుగమ్మాయి మాత్రం కాదు. అవును.. తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలు సైన్ చేసుకుంటూ పోతుంది. క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని లైనప్ చేసేసింది. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం.. ఈ పాప ఎవరంటే.. మృణాల్ ఠాకూర్. సీతారామం మూవీలో సీత క్యారెక్టర్ తో టాలీవుడ్ లో డెబ్యూ చేసిన ఈ భామ.. బాలీవుడ్ నుండి వచ్చింది. బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. మెల్లగా సినిమా అవకాశాలు అందుకొని తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. సీతారామం తర్వాత నానితో హాయ్ నాన్న, విజయ్ దేవరకొండతో ఓ సినిమా ఓకే చేసింది. కాగా ప్రస్తుతం.. ఈ పాప చిన్నప్పటి పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ క్యూట్ పాప గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

mrunal taqor childhood photo 1

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet