iDreamPost
android-app
ios-app

పాపం.. బర్త్ డే నాడే కన్ను మూసిన నటి.. చావును ముందే గుర్తించిందా?

  • Published Apr 05, 2024 | 2:08 PM Updated Updated Apr 05, 2024 | 2:08 PM

ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ చైల్డ్ ఆర్టిస్ట్.. అనూహ్యంగా తన 15వ ఏట చనిపోయింది. అది కూడా ఆమె బర్త్ డే నాడే. ఆ వివరాలు..

ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ చైల్డ్ ఆర్టిస్ట్.. అనూహ్యంగా తన 15వ ఏట చనిపోయింది. అది కూడా ఆమె బర్త్ డే నాడే. ఆ వివరాలు..

  • Published Apr 05, 2024 | 2:08 PMUpdated Apr 05, 2024 | 2:08 PM
పాపం.. బర్త్ డే నాడే కన్ను మూసిన నటి.. చావును ముందే గుర్తించిందా?

మనిషి జీవితం క్షణ భంగురం అంటారు. కన్ను మూస్తే మరణం.. కన్ను తెరిస్తే జననం.. అంటారు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న వ్యక్తి మరునిమిషంలో కన్ను మూయవచ్చు. వస్తువులకు గ్యారెంటీ ఉంటుంది ఏమో కానీ.. మన ప్రాణాలకు మాత్రం కాదు. పుట్టిన ప్రతి మనిషి కన్ను మూస్తాడు. కానీ కొందరి విషయంలో మరణం ఎంత చిత్రంగా ఉంటుంది అంటే.. వారు చనిపోతారని.. ముందే వారికి ముందే తెలుస్తుందేమో.. దాని గురించి తమ సన్నిహితులతో చర్చిస్తారు. ఇక కొందరైతే పుట్టిన రోజు నాడే కన్నుమూస్తారు. ఓ నటి విషయంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బర్త్ డే నాడే ఆ నటి చనిపోయింది. పైగా చనిపోతానేమో అని సన్నిహితుల దగ్గర ఆ విషయాన్ని ప్రస్తావించింది అంట. ఆ వివరాలు.

బాలనటి తరుణి సచ్ దేవ్ గుర్తుందా.. పా అనే సినిమాలో అమితాబ్ బచ్చన్ ఫ్రెండ్ గా యాక్ట్ చేసింది. బాల నటిగా, మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సుమారు 50 ప్రకటనలు చేసింది. ఎంతో కెరీర్ ఉంటుందని భావించిన ఈ చిన్నారి.. అనూహ్యంగా.. అత్యంత చిన్న వయసులోనే కన్నుమూసింది. 15వ ఏట ఓ విమాన ప్రమాదంలో చనిపోయింది ఈ చిన్నారి. ఇక్కడ మరో విషాదకర అంశం ఏంటంటే.. 14 మే 1998న జన్మించిన సచ్ దేవ్ 14 మే 2012న విమన ప్రమాదంలో మరణించింది. అంటే బర్త్ డేనే ఆమెకు చివరి రోజు అయ్యింది.

Child artist sach dev died

ఇదే కాక మరో ఆసక్తికర అంశం ఏంటి అంటే.. ఆమె మరణించే ముందు తన స్నేహితులతో మాట్లాడిందని.. అది కూడా తన మృత్యువి గురించి కావడం గమనార్హం. బర్త్ డే నాడు తన తల్లితో పాటు పిక్నిక్ కోసం నేపాల్ కు బయలుదేరింది. స్నేహితులకు చెప్పాలని అందరినీ కలుసుకుంది. అప్పుడు వారిని చూసి.. మిమ్మల్ని చివరిసారిగా కలుస్తున్నాను అంటూ నవ్వుతూ చెప్పిందట. ఆ మాటలు విన్న తరుణి ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయారట. ఎందుకంటే.. ఆమె గతంలో ఎప్పుడు ఇలా మాట్లాడలేదట. అంతేకాక విమానం ఎక్కే ముందు కూడా తమ స్నేహితుడికి మెసేజ్ పంపిందట. అవును నేను ఎక్కే విమానం కూలిపోతే ఏం జరుగుతుంది..అంటూ సరదాగా తన స్నేహితుడికి చివరి సందేశాన్ని పంపిందట. ఐ లవ్ యూ అని రాసిందట.

మరి చనిపోతున్నట్లు ఆమెకు అర్థం అయిందో ఏమో తెలియదు కానీ.. కన్నుమూయడానికి క్షణాల ముందు మృత్యువు గురించే మాట్లాడింది తరుణి. తన తల్లి గీత సచ్ దేవ్ తో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా విమాన ప్రమాదానికి గురైంది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలు వదిలారు. తరుణి చనిపోయాక ఆమె స్నేహితులు ఈ విషయాలను గుర్తించుకుని ఆవేదన వ్యక్తం చేశారు.