Dharani
Dharani
అలనాటి అందాల నటి, మాజీ ఎంపీ జయప్రదకు భారీ షాక్ తగిలింది. కోర్టు ఆమెకు 6 నెలల జైలు శిక్ష విధించింది. జయప్రదతో పాటు మరో ముగ్గురికి కూడా జైలు శిక్ష విధిస్తూ.. కోర్టు తీర్పు వెల్లడించింది. చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు శిక్ష విధించింది. జయప్రదతో పాటు మిగతా ముగ్గురికి 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. చెన్నైలోని ఓ సినిమా థియేటర్‌కు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఎగ్మోర్ కోర్టు ఈ శిక్ష విధించింది.
కొన్నాళ్ల క్రితం జయప్రద చెన్నై లోని రాయపేటలో ఓ సినిమా థియేటర్ రన్ చేశారు. చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి అన్నారోడ్డులో ఈ సినిమా థియేటర్‌ను నడిపించారు జయప్రద. ఈ క్రమంలో జయప్రద రన్ చేసిన సినిమా థియేటర్‌లో పనిచేస్తున్న కార్మికుల నుంచి వసూలు చేసిన ఈఎస్ఐ మొత్తాన్ని చెల్లించలేదు. దాంతో వారు ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించారు. కానీ జయప్రద మాత్రం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఈ కేసును కొట్టివేయాలంటూ ఎగ్మోర్ కోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేశారు. కానీ కోర్టు ఆమె అభ్యర్థనను తోసి పుచ్చింది. ఇక విచారణలో భాగంగా.. ఎగ్మోర్ కోర్టు ఇవాళ జయప్రదతో పాటు మరో ముగ్గురికి ఆరు మాసాల జైలు శిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ.. తీర్పు వెల్లడించింది.