iDreamPost
android-app
ios-app

విగ్నేష్‌ – నయనతారలపై క్రిమినల్‌ కేసు.. తండ్రి చేసిన పనికి..

  • Published Jul 07, 2023 | 11:22 AM Updated Updated Jul 07, 2023 | 11:22 AM
  • Published Jul 07, 2023 | 11:22 AMUpdated Jul 07, 2023 | 11:22 AM
విగ్నేష్‌ – నయనతారలపై క్రిమినల్‌ కేసు.. తండ్రి చేసిన పనికి..

ప్రముఖ తమిళ స్టార్‌ కపుల్‌ నయనతార- విగ్నేష్‌ శివన్‌లపై చీటింగ్‌ కేసు నమోదైంది. విగ్నేష్‌ తండ్రి శివకొలుందు కారణంగా మొత్తం కుటుంబంపైనే రక్త సంబంధీకులు కేసు పెట్టారు. శివకొలుందు తమను మోసం చేశాడంటూ ఆయన సోదరులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు డీఎస్పీ ఆఫీస్లో ఫిర్యాదు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. విగ్నేష్‌ శివన్‌ది తిరుచ్చిలోని లాల్‌గుడి ప్రాంతం. అతడి తల్లిదండ్రులు స్వగ్రామంలోనే ఉంటున్నారు. వీరికి గ్రామంలో కొంత పూర్వీకుల ఆస్తి ఉంది.

ఈ ఆస్తిని విగ్నేష్‌ తండ్రి శివకొలుందు తమకు తెలియకుండా కాజేశాడని, వేరే వాళ్లకు అమ్మేశాడని ఆయన సోదరులు కుంజితపాదం, మాణిక్యం ఆరోపిస్తున్నారు. పెద్దల ఆస్తిలో తమకు కూడా వాటా ఉంటుందని, తమకు చెప్పకుండానే శివకొలుందు దాన్ని అమ్మేశాడంటూ లాల్‌గుడిలోని డీఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. శివకొలుందుతో పాటు ఆయన భార్య మీనాకుమారి, కుమారుడు విగ్నేష్‌ శివన్‌, కోడలు నయన తార, కూతురు ఐశ్వర్యలపై కూడా ఫిర్యాదు చేశారు.  ఈ నేపథ్యంలోనే గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న విగ్నేష్‌ శివన్‌ పిన్ని తమ వాటా తమకు ఇవ్వాలంటూ ప్రథేయపడుతోంది.

ఆపరేషన్‌ చేయించుకోవటానికి డబ్బు కావాలని వేడుకుంటోంది. ఆమె మాట్లాడుతూ.. ‘‘ నాకు గుండె సంబంధిత వ్యాధి ఉంది. త్వరలో దానికి ఆపరేషన్‌ చేయించుకోవాలి. లేదంటే నా ప్రాణాలు పోతాయి. ఆపరేషన్‌ కోసం నాకు 5 లక్షల రూపాయలు అవసరం అవుతాయి. దయచేసి 5 లక్షలు ఇప్పించి నా ప్రాణాలు కాపాడండి. ఇడ్లీలు అమ్ముకుని బతికే మాకు అంత పెద్ద మొత్తం ఖర్చు చేయటం అసాధ్యం. మా సొత్తు మాక్విండి. నా ప్రాణాలు కాపాడండి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomfixbetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet