iDreamPost
android-app
ios-app

‘చే’ మూవీ టీజర్ విడుదల

  • Published Oct 08, 2023 | 4:43 PM Updated Updated Nov 03, 2023 | 12:00 PM
  • Published Oct 08, 2023 | 4:43 PMUpdated Nov 03, 2023 | 12:00 PM
‘చే’ మూవీ టీజర్ విడుదల

తెరపైకి మరో బయోపిక్ రాబోతుంది. క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపోందుతున్న చిత్రం ‘చే’ లాంగ్ లీవ్ ట్యాగ్ లైన్. క్యూబా తరువాత ప్రపంచంలో తొలిసారి భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న చే గువేరా బియోపిక్ ఇది. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్ పై బీఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ , పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెన్సార్ కు వెళ్లనుంది.

ఇటీవలే చే గువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా ఈమూవీ ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసి, చిత్రయూనిట్‌ను సైతం అభినందించారు. అక్టోబర్ 9న చే గువేరా వర్ధంతి సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమా హీరో, దర్శకుడు బీఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ.. “విప్లవ వీరుడు, యువతకు స్పూర్తిదాయకుడు చే గువేరా జీవిత చరిత్రను సినిమా గా తీయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం.. ఆయన చేసిన పోరాటలు, త్యాగాలు ఈ చిత్రంలో తీశాం. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా ను రూపోందించాం” అని చెప్పారు.

‘తమ మూవీ పోస్టర్‌ను చేగువేరా కూతురు డా.అలైదా గువేరా విడుదల చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నాం. ఆ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, అక్టోబర్ 9న విప్లయోధుడు చేగువేరా వర్ధంతి సందర్భంగా టీజర్ రిలీజ్ చెయ్యడం గర్వంగా ఫీల్ అవుతున్నాం అన్నారు. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకున్న మా సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. నవంబర్ లో మా చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఈ సినిమాకు డీఓపీగా కళ్యాణ్ సమి, జగదీష్, ఎడిటర్‌గా శివ శర్వాణి పనిచేస్తున్నారు. రవిశంకర్‌ సంగీత అందిస్తున్నారు. మరి ఈ సినిమా టీజర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టైగర్ నాగేశ్వరరావు కోసం RRR ఫార్ములా! అలా వాడుకున్నారా..?

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio