iDreamPost

టైగర్ నాగేశ్వరరావు కోసం RRR ఫార్ములా! అలా వాడుకున్నారా..?

  • Author ajaykrishna Updated - 01:47 PM, Sun - 8 October 23
  • Author ajaykrishna Updated - 01:47 PM, Sun - 8 October 23
టైగర్ నాగేశ్వరరావు కోసం RRR ఫార్ములా! అలా వాడుకున్నారా..?

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 చిత్రాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మించారు. వంశీకృష్ణ ఆకెళ్ళ సినిమాని తెరకెక్కించారు. రవితేజ కెరీర్ లో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. ఇప్పటికే ట్రైలర్ ల, సాంగ్స్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా.. దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూవీ టీమ్ మెల్లగా ప్రమోషన్స్ కూడా వేగవంతం చేసింది. అయితే.. ఈ సినిమా ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరొందిన టైగర్ నాగేశ్వరరావు లైఫ్ స్టోరీ స్ఫూర్తితో రూపొందినట్లు తెలుస్తుంది.

ఎన్నో దొంగతనాలు చేసి పోలీసులకు దొరక్కుండా.. చివరికి టైగర్ నాగేశ్వరరావు మరణించినప్పుడు ఎంతోమంది అతన్ని చూసేందుకు వచ్చారంటే మామూలు విషయం కాదు. అలాంటి రియల్ హీరో లైఫ్ స్టోరీ ఆధారంగా సినిమా తీశారు దర్శకుడు వంశీ. ఇప్పటికే సినిమాలో స్టువర్ట్ పురం క్రైమ్ క్యాపిటల్ అని ప్రచారం చేస్తుండటంతో.. స్టువర్ట్ పురం జనాలు అభ్యంతరం తెలుపుతూ కోర్టు వరకు వెళ్లారు. కాగా.. సినిమాని పూర్తిగా రియల్ లైఫ్ ఆధారంగా కాకుండా జస్ట్ స్ఫూర్తి పొంది.. టైగర్ నాగేశ్వరరావు లైఫ్ లో జరిగిన కీలకమైన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసినట్లు సమాచారం. అంటే.. సినిమా స్క్రిప్ట్ ట్రీట్మెంట్ విషయంలో మేకర్స్ ఆర్ఆర్ఆర్ ఫార్ములా ఫాలో అయ్యారని చెప్పవచ్చు.

అదెలా అనంటే.. ఆర్ఆర్ఆర్ మూవీలో కూడా రాజమౌళి అటు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలతో సినిమా తీస్తున్నాడని అంతా అనుకున్నారు. అయితే.. రియల్ గా వాళ్ల లైఫ్ స్టోరీస్ ఆధారంగా కాకుండా కల్పించి.. ఫిక్షనల్ స్టోరీతో మూవీ తీశారు రాజమౌళి. ఇప్పుడదే ఫార్ములాని టైగర్ నాగేశ్వరరావుకు అప్లై చేశారు మేకర్స్. నాగేశ్వరరావు లైఫ్ లోని ముఖ్య ఘట్టాలను, అతని చుట్టూ క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసి తీశారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అందుకే అదనంగా హీరోయిన్ క్యారెక్టర్ కూడా యాడ్ చేశారు. రియల్ లైఫ్ లో టైగర్ నాగేశ్వరరావు ఓ అమ్మాయి వల్ల పోలీసులకు దొరికి ఎన్ కౌంటర్ లో చంపబడ్డాడు. సో.. అది ఈ సినిమాలో అలాగే చూపించారా లేక మార్చారా అనేది తెలియాల్సి ఉంది. మరి టైగర్ నాగేశ్వరరావు గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి