Chandoo Mondeti On Karthikeya 3: కార్తికేయ-3 కచ్చితంగా ఉంటుందన్న డైరెక్టర్ చందు మొండేటి..

కార్తికేయ-3 కచ్చితంగా ఉంటుందన్న డైరెక్టర్ చందు మొండేటి..

Chandoo Mondeti On Karthikeya 3: కార్తికేయ 2 సినిమాకి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా డైరెక్టర్ చందూ మొండేటి కార్తికేయ పార్ట్ 3కి సంబంధించి క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు.

Chandoo Mondeti On Karthikeya 3: కార్తికేయ 2 సినిమాకి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా డైరెక్టర్ చందూ మొండేటి కార్తికేయ పార్ట్ 3కి సంబంధించి క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు.

కార్తికేయ 2 సినిమా పేరు ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ చలనచిత్ర పురస్కారాల్లో కార్తికేయ 2 సినిమాకి ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు దక్కింది. ఈ వార్త విన్న తెలుగు ప్రేక్షకులే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో ఉన్న సినిమా ప్రేక్షకులు అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్తికేయ సినిమాకి ప్రధాని మోదీ నుంచి కూడా ప్రశంసలు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కార్తికేయ 2 సినిమాకి అవార్డు దక్కగానే అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కార్తికేయ సినిమా ఫ్యాన్స్ కి డైరెక్టర్ చందు మొండేటి ఇంకో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. మరి.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

చందు మొండేటి- నిఖిల్ కాంబోలో 2014లో వచ్చిన కార్తికేయ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి అప్లాజ్ లభించింది. ఆ తర్వాత దాదాపు 8 ఏళ్ల తర్వాత చందు మొండేటి- నిఖిల్ కలిసి కార్తికేయ 2 సినిమా తీశారు. ఈసారి సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్లారు. వీళ్లు చెప్పిన కథకు అందరూ మెస్మరైజ్ అయిపోయారు. సైన్స్ ని దేవుడిని కలిపి చూపించిన విధానం అందరినీ మెప్పించింది. కృష్ణుడి కాలి కంకణం కోసం చేసే ప్రయాణం అందరికి బాగా నచ్చేసింది. కార్తికేయ టీమ్ కి ప్రశంసలు కురిపిస్తున్నారు. తారక్ కూడా ఎక్స్.కామ్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు. కార్తికేయ 2 సినిమాకి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు రావడంతో కచ్చితంగా కార్తికేయ 3 గురించి ప్రస్తావన అయితే వస్తుంది. ఈ ప్రశ్నపై డైరెక్టర్ చందు మొండేటి క్లారిటీ ఇచ్చారు.

కార్తికేయ 2 సినిమాకి జాతీయ అవార్డు దక్కడంతో మూవీ టీమ్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కార్తికేయ సిరీస్ డైరెక్టర్ చందు మొండేటి కీలక వ్యాఖ్యలు చేశారు. కార్తికేయ 3 సినిమా కచ్చితంగా ఉంటుంది అనే విషయాన్ని అయితే స్పష్టం చేశారు. ఈ కామెంట్ పాన్ ఇండియా లెవల్లో ఉన్న సినిమా ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈసారి కార్తికేయ చేయబోయే అడ్వెంచర్స్ ఎలా ఉండబోతున్నాయి అంటూ ఇప్పటి నుంచే ఊహాగానాలు స్టార్ట్ అయిపోయాయి. అలాగే కార్తికేయ పరిధిని మరింత పెంచాలి అని సినిమా ప్రేక్షకులు కోరుకుంటున్నారు. జాతీయ అవార్డు సాధించిన తర్వాత డైరెక్టర్ చందు మొండేటిపై మరింత బాధ్యత పెరిగిందనే చెప్పాలి. దానికి తగినట్లుగానే సినిమా పరిధిని కూడా పెంచేందుకు ఆస్కారం లేకపోలేదు. మరి.. కార్తికేయ 3 కచ్చింతంగా ఉంటుంది అని చందు మొండేటి స్పష్టం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments