iDreamPost
android-app
ios-app

హీరోయిన్స్ ని క్వశ్చన్స్ అడగరా? మీడియాని ఏకి పారేసిన చాందినీ చౌదరి..

  • Published Mar 13, 2024 | 6:28 PM Updated Updated Mar 13, 2024 | 6:28 PM

Gaami- Chandini Chowdary: గామి చిత్రానికి దక్కుతున్న రెస్పాన్స్ చూసి మేకర్స్ ఆనందం పట్టలేకపోతున్నారు. సక్సెస్ మీట్స్ కూడా పెడుతున్నారు. తాజాగా పెట్టిన ప్రెస్ మీట్ లో చాందినీ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Gaami- Chandini Chowdary: గామి చిత్రానికి దక్కుతున్న రెస్పాన్స్ చూసి మేకర్స్ ఆనందం పట్టలేకపోతున్నారు. సక్సెస్ మీట్స్ కూడా పెడుతున్నారు. తాజాగా పెట్టిన ప్రెస్ మీట్ లో చాందినీ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

  • Published Mar 13, 2024 | 6:28 PMUpdated Mar 13, 2024 | 6:28 PM
హీరోయిన్స్ ని క్వశ్చన్స్ అడగరా? మీడియాని ఏకి పారేసిన చాందినీ చౌదరి..

గామి, విద్యాధర్, విశ్వక్ సేన్, చాందినీ చౌదరి.. గత కొన్నిరోజులుగా టాలీవుడ్ లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేర్లు ఇవి. ఈ సినిమా కోసం ఒక డైరెక్టర్ ఆరేళ్లు కష్టపడ్డాడు, నటీనటులు నాలుగేళ్లు ఈ సినిమా కోసం ఎంతగానో కృషి చేశారు. విడుదల ముందు వరకు కూడా ఈ మూవీపై మేకర్స్ కి కూడా అంచనాలు లేవు. మనకి నచ్చిన సినిమా తీశాం. మనం చూసుకోవడానికి తీశాం. మనలాంటి టేస్ట్ ఉన్నవాళ్లే మన ఆడియన్స్ అనుకున్నారు. కానీ, మేకర్స్ అంచనాలు తనలకిందులు అయ్యాయి. ఆడియన్స్ నుంచి గామి సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ తో మొదలైన వీళ్ల ఇంటర్వ్యూలు ఇప్పుడు సక్సెస్ మీట్ లతో కొనసాగుతూనే ఉన్నాయి.

మార్చి 8న థియేటర్లలో రిలీజ్ అయిన గామి చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఈ మూవీ కేవలం మూడురోజుల్లోనే లాభాల బాట పట్టింది. మూవీని తీసుకున్న ప్రతి బయ్యర్ ఇప్పుడు లాభాలు అందుకుంటున్నారు. ఈ విషయాన్ని ఎంతో ఆనందంతో, ఎంతో గర్వంగా మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం గామి సినిమా బృందం ఆడియన్స్ ఇచ్చిన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. వాళ్ల అభిప్రాయాలను, ఆడియన్స్ చూపించిన ప్రేమను సక్సెస్ మీట్స్ రూపంలో వ్యక్త పరుస్తున్నారు. ఈ చిత్రం మొత్తంలో హయ్యెస్ట్ క్రెడిట్ మాత్రం డైరెక్టర్ విద్యాధర్ కే చెందుతుంది. ఆ తర్వాత విశ్వక్ సేన్- చాందినీ చౌదరి కష్టాన్ని ఆడియన్స్ ప్రత్యేకంగా పొగిడేస్తున్నారు.

ముఖ్యంగా ఒక నటిగా ఇలాంటి ప్రయోగాత్మక కథ కోసం చాందినీ చౌదరి పడిన కష్టానికి ప్రశంసలు దక్కుతున్నాయి. గామి చిత్ర బృందం తాజాగా తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఆ ప్రెస్ మీట్ లో డైరెక్టర్, హీరో, హీరోయిన్ పాల్గొన్నారు. చాందినీ చౌదరి కూడా తన అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. చాందినీ చౌదరి మాట్లాడుతూ.. “అనుకున్న దానికన్నా ఇంత హిట్ చేసి.. థియేటర్లలో ఇంత ఆరాధిస్తున్నందుకు చాలా థాంక్స్. ఇలాంటి ఎక్సపరిమెంటల్ న్యూ కైండ్ ఆఫ్ సినిమాని ఎంకరేజ్ చేయడం.. ఇక మీదట రాబోయో కొత్త కొత్త ఐడియాస్ కి పునాది అవుతుంది. ప్రెస్ నుంచి, ఆడియన్స్ నుంచి వచ్చిన ప్రేమకు, సపోర్ట్ కి వ్యూ ఆర్ గ్రేట్ ఫుల్” అంటూ చాందినీ చౌదరి చెప్పుకొచ్చింది.

Chandini chowdary fire on media

హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడిన తర్వాత ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతారా అని వెయిట్ చేసింది. కానీ, ఎవరు ప్రశ్నలు అడగలేదు. ఆ తర్వాత చాందినీ ఇలా రియాక్ట్ అయ్యింది. “ఎప్పుడైనా మేల్ యాక్టర్స్, హీరోలు, డైరెక్టర్లకు మాత్రమే ప్రశ్నలు ఉంటాయి. హీరోయిన్స్ కి ఎలాంటి ప్రశ్నలు ఉండవు” అంటూ చెప్పుకొచ్చింది. వెంటనే విశ్వక్ సేన్ ఈ ప్రెస్ మీట్ మొత్తం కాదు.. ఇదే హైలెట్ అవుతుందని చెప్పాడు. ఆ తర్వాత చాందినీ చౌదరి అనుకున్నది బలంగా చెప్పింది. నేను చూస్తూనే ఉన్నాను. హీరోలు, డైరెక్టర్లనే ప్రశ్నలు అడుగుతారు. హీరోయిన్స్ ని అడగరు అంటూ మరోసారి తన అభిప్రాయాన్ని బలంగా చెప్పేసింది.

నిజంగానే ఇప్పుడు చాందినీ చౌదరి ఒపీనియన్ వైరల్ అవుతోంది. ఇలాంటి అభిప్రాయం ఒక్క చాందినీ చౌదరికే కాదు.. ఇంకా ఎంతోమంది హీరోయిన్స్ కి ఉండి ఉండచ్చు. కానీ, ఎవరూ ఇలా పైకి చెప్పే ప్రయత్నం చేయలేదు. డైరెక్టర్ కూడా చాందినీ చౌదరిని ఆపాలని ప్రయత్నం చేశాడు. కానీ, చాందినీ చౌదరి మాత్రం తాను అనుకున్న విషయాన్ని ఎంతో స్పష్టంగా, బలంగా, గట్సీగా చెప్పేసింది. ఆ తర్వాత ఒక ప్రశ్న అడిగినప్పటికీ అది మొక్కుబడిగా అడిగిన ప్రశ్నే అని భావిస్తూ.. వన్ వర్డ్ ఆన్సర్ చెప్పేసింది. గామిలో చాందినీ యాక్టింగే కాదు.. ఇలా ప్రశ్నించిన తీరు కూడా అందరినీ మెప్పిస్తోంది. ఆమె గట్స్ కి, ప్రశ్నించే విధానానికి, అనుకున్నది అనుకున్నట్లు చెప్పడాన్ని కూడా కచ్చితంగా ప్రశంసించి తీరాల్సిందే. మరి.. చాందినీ చౌదరి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş