iDreamPost
android-app
ios-app

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తానంటూ హీరోయిన్‌కు బెదిరింపులు

  • Published Mar 29, 2024 | 5:22 PM Updated Updated Mar 29, 2024 | 5:22 PM

చాందిని చౌదరి ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అవుతున్న హీరోయిన్స్ లిస్ట్ లో ఈ అమ్మడు కూడా యాడ్ అయింది. అయితే, తాజాగా చాందిని ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

చాందిని చౌదరి ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అవుతున్న హీరోయిన్స్ లిస్ట్ లో ఈ అమ్మడు కూడా యాడ్ అయింది. అయితే, తాజాగా చాందిని ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 29, 2024 | 5:22 PMUpdated Mar 29, 2024 | 5:22 PM
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తానంటూ హీరోయిన్‌కు బెదిరింపులు

ఇండస్ట్రీలో ఎంతో మంది కొత్త హీరోయిన్స్ వస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారు తీసిన సినిమాలు తక్కువే అయినా కూడా.. వారి వారి ప్రతిభను బట్టి.. ప్రేక్షకులలో వారికి ఆదరణ బాగా లభిస్తుంది. ఇలా ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ వారి నటనా ప్రావిణ్యంతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుని. వారి వారి వరుస సినిమాలతో బిజీ బిజీగా కాలం గడుపుతున్నారు. అటు సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. వారి అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు ఇంటర్వూస్ అటెండ్ అయినపుడు.. వారికీ సంబంధించిన వ్యక్తి గత విషయాలు బయటపడుతూ ఉంటాయి. ఆ విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అలానే ఇప్పుడు హీరోయిన్ చాందిని చౌదరికి సంబంధించిన ఓ పెర్సనల్ టాపిక్ కూడా వైరల్ అవుతూ ఉంది.

చాందిని చౌదరి.. కనిపించింది కొన్ని సినెమాలనైనా కానీ.. ప్రేక్షకులలో మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కేటుగాడు సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయం అయిన ఈ భామ.. సుహాస్ హీరోగా నటించిన కలర్ ఫోటో సినిమాతో అందరికి దగ్గరయింది. అయితే, చాందిని చౌదరి మొదట.. షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్ గా చేస్తూ ఉండేది. అలా క్రమ క్రమంగా.. షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఫిలిమ్స్ లో హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో.. ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంది. అయితే, చాందిని చౌదరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తి గత జీవితానికి సంబంధించిన ఓ విషయాన్నీ పంచుకుంది. అదేంటంటే.. ఈ మధ్య కాలంలో ఆమెను ఒకరు.. గెస్ట్ హౌస్ కు రావాలని.. లేకుంటే ఫొటోస్ మార్ఫింగ్ చేస్తాం అని బెదిరించారట. దీనితో ఈ అమ్మడు వణికిపోయిందట. భయంతో ఏడ్చేసిందట . అయితే, ఆ కాల్ చేసింది ఎవరా అని ఆరా తీస్తే.. అసలు విషయం బయటపడింది.

అసలు విషయం ఏంటంటే.. ఆ కాల్ చేసింది ఎవరో కాదు.. ఇండీస్ట్రీలో టామ్ బాయ్ గా చలామణి అవుతున్న స్నిగ్ధ. వీరిద్దరి మధ్య పరిచయం , స్నేహం బాగానే ఉన్నాయి. అయితే, ఓ రోజు స్నిగ్ధ ఒక కొత్త నెంబర్ నుంచి.. చాందినికి కాల్ చేసి.. మీరు గెస్ట్ హౌస్ కు రావాలి అని.. లేకుంటే ఫోటోలు, వీడియోలు మార్ఫ్ చేస్తానని ప్రాంక్ చేసిందట. ఈ విషయాన్నీ స్వయంగా స్నిగ్ధనే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది, ఈ ఇన్సిడెంట్ గురించి చాందినికి నిజం తెలిసిపోయినా తర్వాత.. చాందిని స్నిగ్ధకు కాల్ చేసి.. నువ్వు ఎక్కడున్నావ్ అని అడిగితే.. ఆ ప్లేస్ చెప్తే.. చాందిని వెళ్లి స్నిగ్ధను లాగి పెట్టి కొట్టిందట.. ఈ విషయాన్నీ కూడా.. స్నిగ్దనే స్వయంగా చెప్పుకొచ్చింది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş