iDreamPost
android-app
ios-app

గంభీరమైన గొంతుతో భయపెట్టే ఈ స్టార్ విలన్ గురించి ఈ విషయాలు తెలుసా..?

గంభీరమైన గొంతు, తన ఆహార్యంతో భయపెట్టే ఈ స్టార్ విలన్ గురించి తెలుసా..? తెరపైన మాత్రమే విలన్.. నిజ జీవితంలో ఎన్నో మంచి పనులు చేశాడు. అంతేనా ఓ స్టూడియోను స్థాపించి..

గంభీరమైన గొంతు, తన ఆహార్యంతో భయపెట్టే ఈ స్టార్ విలన్ గురించి తెలుసా..? తెరపైన మాత్రమే విలన్.. నిజ జీవితంలో ఎన్నో మంచి పనులు చేశాడు. అంతేనా ఓ స్టూడియోను స్థాపించి..

గంభీరమైన గొంతుతో భయపెట్టే ఈ స్టార్ విలన్ గురించి ఈ విషయాలు తెలుసా..?

ఓ మూవీ ఎనౌన్స్ కాగానే హీరో హీరోయిన్లతో పాటు విలన్ ఎవరోనన్న ఆసక్తి చూపుతుంటారు. నెగిటివ్ రోల్ అయినప్పటికీ.. హీరోహీరోయిన్ల తర్వాత ప్రాధాన్యత ఉండే పాత్ర అంటే అదే. ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో విలన్లకు కొదవ లేకుండా పోయింది. హీరోలు సైతం ఆంటోగనిస్టులుగా కనిపించేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. జగపతి బాబు నుండి సైఫ్ అలీఖాన్ వరకు హీరోల నుండి విలన్లుగా టర్న్ అయిన సంగతి విదితమే. హీరోను తలదన్నే బలమైన పాత్రలో మెస్మరైజ్ చేస్తున్నారు. ఇదిగో ఈ ఫోటోలో నటుడు కూడా విలన్స్ రోల్స్‌తో ప్రేక్షకులను చెమలు పట్టిస్తుంటాడు. గంభీరమైన గొంతుతో, మాస్ లుక్స్‌తో భయపెట్టే ఈ విలన్ పేరు మైమ్ గోపి. మన పొరుగు ఇండస్ట్రీ కోలీవుడ్ నుండి వచ్చిన మరో స్టార్ విలన్. ఇప్పుడు తెలుగులో బిజీయెస్ట్ విలన్లనో ఒకరిగా మారిపోయారు.

గోపి.. సినిమాల్లోకి రాకముందు థియేటర్ ఆర్టిస్ట్. చెన్నైలో జి మైమ్ స్టూడియో ఏర్పాటు చేసి ప్రదర్శనలిచ్చేవాడు. అలా ఆయనకు మైమ్ గోపి అన్న పేరు వచ్చింది. మైమింగ్ నైపుణ్యాలను నేరవేర్చుకునేందుకు ప్రత్యేక అవసరాలున్న పిల్లలతో కలిసి పనిచేసేవాడు. ఆయన వివిధ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించే వాడు. 1994లో స్టూడియోను స్థాపించి.. చెన్నై అంతటా ప్రదర్శనలిచ్చేవాడు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మైమ్ గోపి. 2008లో కన్నమ్, కన్నుమ్ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చాడు గోపి. పా రరంజిత్ మద్రాస్ తో ఫేమ్ తెచ్చుకున్నాడు. మారి, కబాలీ, భైరవ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు. తెలుగులో రావడానికి దాదాపు 10 ఏళ్లు పట్టింది. నాగశౌర్య, రష్మిక మందన్న నటించిన ఛలో మూవీతో టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ అయ్యాడు.

Aay Movie Villain 1

ఈ మూవీ హిట్ కొట్టడంతో తెలుగు ఇండస్ట్రీలో మాస్ ఆంటోగనిస్టుగా మారిపోయాడు. భీష్మ, గల్లీ రౌడీ, పుష్ప చిత్రాల్లో నటించాడు. పుష్పలో చెన్నై మురుగన్ పాత్రలో ఆకట్టుకున్నాడు.  యాక్టింగ్, ఆహార్యంతో భయపెడుతుంటాడు ఈ స్టార్ విలన్. అటు తమిళంలో చేస్తూనే.. తెలుగులో ఏడాదికి రెండు మూడు చిత్రాలకు తగ్గకుండా ప్లాన్ చేసుకుంటన్నాడు. గత ఏడాది ఇద్దరి స్టార్ హీరోలతో వర్క్ చేశాడు మైమ్ గోపి. చిరంజీవితో వాల్తేరు వీరయ్యలో దాస్ పాత్రలో మెప్పించగా.. ప్రభాస్-నీల్ కాంబోలో వచ్చిన సలార్ చిత్రంలో బిలాయ్ పాత్రను పోషించాడు. ఈ ఏడాది ఊరు పేరు భైరవకోన, తమిళ చిత్రాలు గరుడన్, వెపన్ తో పాటు తాజాగా వచ్చిన ఆయ్ మూవీతో అలరించాడు. ఇన్ స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్‌లో నటించాడు. ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టుల్లో వర్క్ చేస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by G Mime Studio (@g_mime_studio)