iDreamPost
android-app
ios-app

నిహారికపై సంచలన వ్యాఖ్యలు చేసిన చైతన్య తండ్రి?

నిహారికపై సంచలన వ్యాఖ్యలు చేసిన చైతన్య తండ్రి?

నిహారిక, చైతన్య జొన్నలగడ్డ గతంలో వివాహం చేసుకుని ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, వీళ్లు విడాకులు తీసుకుంటున్నారంటూ గతంలో వార్తలు రాగా.. అవన్నీ పుకార్లు అనుకున్నారు. కానీ, చివరికి అదే నిజమైంది. ఇటీవల తాము విడాకులు తీసుకుంటున్నామంటూ తమ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అధికారంగా వెల్లడించారు. వీళ్లు విడాకులు తీసుకోవడంతో మెగా అభిమానులే కాకుండా అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీంతో.. వాళ్ల విడాకుల వార్త గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారింది. అసలు నిహారిక, చైతన్యల ఎందుకు విడిపోయారు? వాళ్లు విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి? అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చలు మొదలు పెట్టారు.

2020 డిసెంబర్ లో పెళ్లి చేసుకున్న జంట.. జులై 2023లో విడాకులు తీసుకున్నారు. నిహారిక ఇన్నాళ్లు సినిమాల్లో కూడా పెద్దగా కనిపించిందిలేదు. ఇక విడాకుల తర్వాత ఆమె మెల్లగా సినిమాల్లో నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె కొన్ని సినిమాల్లో నటిస్తూ, మరికొన్ని సినిమాలు నిర్మించనున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఆమెకు సంబంధించిన నెగటివ్ వార్త ఒకటి ఇప్పుడు ప్రచారంలో ఉంది. అందేటంటే.. చైతన్య తండ్రి విశ్రాంత ఐజీ ప్రభాకర్.. నిహారిక విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారంట.

“నేను ఒక గౌరవమైన హోదాలో ఉన్నాను. ఇంట్లో నిహారిక పెద్దవాళ్లతో ఎప్పుడూ గౌరవంగా మసులుకోలేదు. అసలు భర్తతో కలిసి జీవించాలనే ఆశ తనకి లేదు. ఎప్పుడూ పబ్బులు, పార్టీలు అంటూ తిరగడమే తప్పా.. ఒక్క క్షణం కూడా కుటుంబం గురించి ఆలోచించలేదు. వీళ్లు విడాకుల తీసుకున్న తర్వాత మెగా అభిమానులు నా కొడుకు చైతన్యపై తప్పుడు ప్రచారాలు చేస్తుండడంతో నేను సహించలేకపోతున్నాను” అంటూ సన్నిహితలు వద్ద కామెంట్ చేశారంటూ చెబుతున్నారు.

అయితే చైతన్య తండ్రి నిజంగా ఈ వ్యాఖ్యలు చేశారా? అంటే అందుకు ఏమో అనే సమాధానం వినిపిస్తోంది. అసలు ఈ వార్త నిజమో.. అబద్ధమో కూడా ఎవరికీ తెలియదు. కానీ.. నెట్టింట మాత్రం బాగా వైరల్ అవుతోంది. విడాకులు అనేవి వారి వ్యక్తిగత విషయం. కానీ, అలాంటి వ్యవహారంపై నెట్టింట ఇలాంటి పుకర్లు రావడం కొత్తేం కాదు. కానీ, ఇలాంటి పుకార్లు అసలు ఎలా పుట్టుకొస్తాయో అంటూ మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet giriş