iDreamPost
android-app
ios-app

HanuMan: హనుమాన్ కి అమిత్ షా అభినందనలు

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో.. తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్‌ సినిమాపై కేంద్ర హోమంత్రి ప్రశంసలు కురిపించారు. ఆ వివరాలు..

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో.. తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్‌ సినిమాపై కేంద్ర హోమంత్రి ప్రశంసలు కురిపించారు. ఆ వివరాలు..

HanuMan: హనుమాన్ కి అమిత్ షా అభినందనలు

హనుమాన్ సినిమా ఆర్ధికంగా బ్రహ్మాండమైన ఫలితాలను సాధించడమే కాకుండా, దర్శకనిర్మాతలకు, నటీనటులకు తిరుగులేని ఇమేజ్ నిచ్చింది. ఒక్క సినిమాతో హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి దేశం మొత్తం మీద అత్యంత పాప్యులర్ ఫిగర్స్ అయ్యారు. డబ్బుతో పాటు గౌరవాన్ని కూడా కట్టబెట్టిన సినిమాలు ఎక్కడో గానీ ఉండవు. అలాటి అపూర్వ విజయాన్ని సాదించింది హనుమాన్ టీం.

ఈ మధ్యనే కేంద్రమంత్రి అమిత్ షాని హనుమాన్ హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇద్దరూ అమిత్ షా ఆహ్వానం మేరకు కలిశారు. అ సందర్భంగా హనుమాన్ టింని అమిత్ షా అబినందనలలో ముంచెత్తారు. హనుమాన్ లాటి ధ్రిల్లింగ్ వర్క్ చేసినందుకు వాళ్ళని మనసారా మెచ్చుకున్నారు. ఇటువంటి గొప్ప గొప్ప సినిమాలే ఇకమీదట కూడా చెయ్యాలని, సినిమా గౌరవాన్ని, ప్రతిష్టను పెంచాలని అమిత్ షా కోరారు.

Amit Shah congratulates Hanuman

హనుమాన్ లాటి సినిమాలు మన దేశంలోని సంప్రదాయాలను, విలువను ప్రతిబింబిస్తాయని, ప్రతీ ఒక్కరూ ఈ దిశగా పని చేయాలని చెబుతూ, తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ భవిష్యత్తులో కూడా హనుమాన్ లాటి సమున్నతమైన కథాంశాలతో సినిమాలు రూపొందించి వచ్చిన పేరును నిలుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు అమిత్ షా తన ఎక్స్ హేండిల్ ద్వారా పెట్టిన పోస్టు దేశవ్యాప్తంగా బాగా వైరల్ అయింది. అమిత్ షానే ఈ మీటింగ్ ఫొటోలను షేర్ చేశారు.

అమిత్ షా పెట్టిన పోస్ట్ కి స్పందిస్తూ తేజ కూడా తిరిగి పోస్ట్ పెట్టాడు. అమిత్ షా వంటి వ్యక్తి హనుమాన్ సినిమాని అభినందించడం, తమకి శుభాకాంక్షలు చెప్పడం జీవితంలో చాలా గొప్ప ముమెంట్ అని, ఇదెన్నటికీ మరచిపోని చిరస్మరణీయమైన అనుభవమని ట్వీట్ చేశాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రిప్లై ఇచ్చాడు. మొత్తానికి హనుమాన్ సినిమా పెరఫారమెన్స్ పరంగానే కాదు, ఇండివిడ్యువల్ స్టేటస్ ని కూడా తెచ్చిపెట్టింది. ఒక దెబ్బకి రెండు పిట్టలంటే ఇదే.