iDreamPost
android-app
ios-app

Jabardasth Avinash: పుట్టెడు దుఃఖంలో ముక్కు అవినాష్.. బాసటగా నిలిచిన సెలబ్రిటీలు

  • Published Jan 08, 2024 | 10:02 PM Updated Updated Jan 09, 2024 | 11:54 AM

ఏ దంపతులకైనా తల్లిదండ్రులు కావడం కన్నా ఆనందం ఇంకొకటి ఉండదు. అలాంటి క్షణాలను అనుభవించాల్సిన సమయంలో అవినాష్ దంపతులకు మాత్రం విషాద ఘటన ఎదురైంది.

ఏ దంపతులకైనా తల్లిదండ్రులు కావడం కన్నా ఆనందం ఇంకొకటి ఉండదు. అలాంటి క్షణాలను అనుభవించాల్సిన సమయంలో అవినాష్ దంపతులకు మాత్రం విషాద ఘటన ఎదురైంది.

  • Published Jan 08, 2024 | 10:02 PMUpdated Jan 09, 2024 | 11:54 AM
Jabardasth Avinash: పుట్టెడు దుఃఖంలో ముక్కు అవినాష్.. బాసటగా నిలిచిన సెలబ్రిటీలు

సెలబ్రిటీలు ఊరికే అయిపోరు. వారికి అంత పేరు రావడం వెనుక కొన్నేళ్ల కష్టం ఉంటుంది. కష్టపడితే అవకాశం దక్కుతుంది. కృషి, అభిమానుల మద్దతు ఉంటే సక్సెస్ వరిస్తుంది. కానీ, సెలబ్రిటీలకైనా నిజమైన సంతోషం మాత్రం ఫ్యామిలీ ద్వారానే దక్కుతుంది. అలాంటి ఫ్యామిలీలో ఎవరైనా మంచి విషయాలే జరగాలని కోరుకుంటారు. కానీ, కొన్నిసార్లు మాత్రం అనుకోని సంఘటనలు ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. అలాంటి ఒక ఇబ్బందికర ఫేజ్ లో ప్రస్తుతం ముక్కు అవినాష్ ఉన్నాడు. తమ కుటుంబంలోకి ఆ స్పెషల్ పర్సన్ వల్ల తల్లిదండ్రుల ప్రమోషన్ వస్తుందని ఎన్నో కలలు కన్న వారికి నిరాశే మిగిలింది. ఇటీవలే వారు తమ బిడ్డను కోల్పోయిన విషయాన్ని అవినాష్ ఫ్యాన్స్ కు తెలియజేశాడు. ఈ వార్త విన్న తర్వాత సెలబ్రిటీలు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అవినాష్ తమ ఇంట జరిగిన తీవ్ర విషాదం గురించి తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించాడు. తమ దంపతులు తమ బిడ్డను కోల్పోయిన విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు. అయితే ఎందుకు ఫ్యాన్స్ కు చెప్పాల్సి వచ్చింది అనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇన్నాళ్లు తనకు ఆనందం వచ్చినా, బాధ వచ్చిన ప్యాన్స్ తో షేర్ చేసుకున్నానని.. అలాగే ఆ బాధ్యతతోనే ఈ విషయాన్ని కూడా అభిమానులకు తెలియజేయాలి అనుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయంపై తాను ఏమీ మాట్లాడదలుచుకోలేదని.. అలాగే ఎవరూ ఇక ఈ విషయంపై ప్రశ్నలు వేయద్దంటూ రిక్వెస్ట్ చేశాడు. ఆ పోస్టు కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందరూ ముక్కు అవినాష్- అనూజ దంపతులను తల్చుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఎవరికీ ఎదురుకాకూడని ఒక విషాదం అవినాష్ దంపతులకు ఎదురైందంటూ విచారం వ్యక్తం చేశారు. అలాగే వారు ధైర్యాన్ని కోల్పోవద్దు అంటూ సూచించారు.

మరోవైపు సెలబ్రిటీలు సైతం అవినాష్ దంపతులకు ధైర్యం చెప్పారు. ఇలాంటి విషాదకర పరిస్థితుల్లో అవినాష్ కు మద్దతుగా ఉంటామన్నారు. అవినాష్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్, బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన వాళ్లు అందరూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అవినాష్ ఫ్రెండ్- యాంకర్ శ్రీముఖి ఎమోషనల్ అయ్యింది. ధైర్యంగా ఉండాలంటూ సూచించింది. కిరాక్ ఆర్పీ భార్య లక్కీ కూడా ధైర్యంగా ఉండాలని.. త్వరలోనే మరో శుభవార్త వింటారంటూ చెప్పుకొచ్చింది. అఖిల్ సార్ధక్ తమ సపోర్ట్ ని తెలియజేస్తూనే.. వాస్తవాన్ని అంగీకరించాలని కోరాడు. ప్రతి విషయంలో భగవంతునికి ఒక లెక్క ఉంటుందని.. కొన్నిసార్లు అది కాస్త కష్టంగా ఉంటుందని చెప్పాడు. అయితే దానిని అంగీకరించాలంటూ సూచించాడు. ఇలా ప్రతి ఒక్కరు అవినాష్ దంపతులకు తమ మద్దతు తెలియజేస్తూ వారిని ధైర్యంగా ఉండాలంటూ కోరారు. ఎక్కడా కూడా ధైర్యాన్ని కోల్పోవద్దని చెప్పారు.

అవినాష్ కెరీర్ విషయానికి వస్తే.. ఏ షోతో అయితే తన కెరీర్ ని ప్రారంభించాడో అదే అతని ఇంటి పేరుగా మారిపోయింది. జబర్దస్త్ అవినాష్ అనే పేరును దక్కించుకున్నాడు. ఒక మనిషికి అంతకన్నా సక్సెస్ ఏం కావాలి. తర్వాత కెరీర్ లో భాగంగా బిగ్ బాస్ కోసం తనకు ఎంతో ఇష్టమైన షోని వదిలేశాడు. కెరీర్ లో ఒక మంచి కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. షోస్, స్పెషల్ ఈవెంట్స్ మాత్రమే కాకుండా సినిమాల్లో సైతం కనిపిస్తూ అలరిస్తున్నాడు. హీరోగా కూడా తన అదృష్టాన్ని అవినాష్ పరీక్షించుకోనున్నాడు. ఇలాంటి తరుణంలో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ అనుకోని సంఘటన ఎదురైంది. దానిని అవినాష్ దంపతులు అధిగమించి సాధారణ జీవితాన్ని సాగించాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mukku Avinash (@jabardasth_avinash)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet