iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటుడిపై అత్యాచార కేసు నమోదు!

  • Published Aug 29, 2024 | 3:24 PM Updated Updated Aug 29, 2024 | 3:28 PM

Kerala Actor Mukesh: మాలీవుడ్ లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నటులపై కేసులు నమోదు అయ్యాయి.

Kerala Actor Mukesh: మాలీవుడ్ లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నటులపై కేసులు నమోదు అయ్యాయి.

ప్రముఖ నటుడిపై అత్యాచార కేసు నమోదు!

సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి కాస్టింగ్ కౌచ్ కొనసాగుతుందని విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇండస్ట్రీలో రాణించాలంటే దర్శక, నిర్మాతలకు పడక సుఖం అందిస్తేనే ఛాన్సులు ఇస్తారని టాక్. ఇటీవల మీటూ, కౌస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమాలు రావడంతో పలువురు సినీ తారలు గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపులు ఒక్కొక్కటీ బయటపెడుతున్నారు. ఇక మాలీవుడ్ లో నటీమణులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు రావడం.. దానిపై జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. ప్రస్తుతం జస్టిస్ హేమ కమిటీ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రముఖ నటుడిపై అత్యాచార కేసున నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళితే.

మలయాళ సినీ పరిశ్రమలో జస్టిస్‌ హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంతోమంది నటీమణులు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కి బలైనట్లు చెబుతున్నారు. ఈ నివేదిక వల్ల ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి 17 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. మాలీవుడ్ ప్రముఖ నటుడు, అధికార పార్టీ CPI(M) MLA ఎమ్ ముకేశ్‌పై అత్యాచార కేసు నమోదు చేశారు పోలీసులు. కొన్నేళ్ళ క్రితం ముఖేశ్ నన్ను లైంగికంగా వేధించాడని ఓ నటి ఇచ్చిన ఆరోపణల మేరకు కేసు రిజిస్ట్రర్ చేసినట్లు అధికారులు చెప్పారు.

Rape case registered against famous actor!

నటుడు ఎం ముకేశ్ పై కొచి సిటిలోని మారడు పీఎస్ లో ఐపీఎస్ 376 (రే*ప్ ) సేక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత నమోదు అయిన మూడో హై ప్రొఫైల్ కేసు ఇదే. అంతకు ముందు జయసూర్య, మణియం పిళ్ల రాజు పై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మాలీవుడ్ కి చెందిన నటీమణులు తమ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎక్కువ ఉన్నాయని ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. జస్టిస్‌ హేమ కమిటీ నివేదికలో AMMA సభ్యులు ఉన్న కారణంగా నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు మోహన్ లాల్.