Krishna Kowshik
Case File On Rakshit Shetty.. శాండిల్ వుడ్ యంగ్ హీరోల్లో ఒకరు రక్షిత్ శెట్టి. అటు నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా రాణిస్తున్నాడు. సప్తసాగరాలు దాటి మూవీతో పలకరించిన అతడిపై పోలీస్ కేసు నమోదైంది. ఎందుకంటే..?
Case File On Rakshit Shetty.. శాండిల్ వుడ్ యంగ్ హీరోల్లో ఒకరు రక్షిత్ శెట్టి. అటు నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా రాణిస్తున్నాడు. సప్తసాగరాలు దాటి మూవీతో పలకరించిన అతడిపై పోలీస్ కేసు నమోదైంది. ఎందుకంటే..?
Krishna Kowshik
దక్షిణాది సినీ ఇండస్ట్రీల్లో ఒకటి శాండిల్ వుడ్. చందన సీమ కూడా ఇటీవల సత్తా చాటుతుంది. బాలీవుడ్ బాక్సాఫీసుకు ఇటు దర్శక ధీరుడు రాజమౌళి, అటు ప్రశాంత్ నీల్.. సౌత్ స్టామినా ఏంటో నిరూపించారు. కేజీఎఫ్‌కు ముందు కేజీఎఫ్‌కు తర్వాత అన్నట్లుగా మారిపోయింది కన్నడ ఇండస్ట్రీ. యష్ తర్వాత సత్తా చాటారు రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి. కాంతార, 777 చార్లీ వంటి చిత్రాలతో అలరించారు. అయితే ఈ సినిమాల కన్నా ముందే రక్షిత్ శెట్టి తెలుగు వారికి సుపరిచితమయ్యాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న మాజీ ప్రియుడిగా వార్తల్లో నిలిచాడు. ఎంగేజ్ మెంట్ వరకు వెళ్లిన వీరి ప్రేమ వ్యవహారం.. ఆ తర్వాత క్యాన్సిల్ అయిన సంగతి విదితమే. తాజాగా సప్త సాగరాలు దాటి సైట్ఎ, సైడ్ బి చిత్రాలతో అలరించాడు.
ఇదిలా ఉంటే శాండల్‌వుడ్ నటుడు రక్షిత్ శెట్టి వివాదంలో చిక్కుకున్నాడు. కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలపై రక్షిత్ శెట్టిపై బెంగళూరులోని యశ్వంత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అనుమతి తీసుకోకుండా రెండు పాటలను వినియోగించాడన్న ఆరోపణలపై ఫిర్యాదు అందడంతో కేసు ఫైల్ అయ్యింది. ఈ నేపథ్యంలో వివరణ కోరుతూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల రక్షిత్ శెట్టి.. తన సొంత బ్యానర్ పరమవపై బ్యాచిలర్ పార్టీ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.ఈ ఏడాది జనవరిలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో తమ అనుమతి తీసుకోకుండా రెండు పాటలు వినియోగించారంటూ ఎంఆర్టీ మ్యూజిక్‌లో భాగస్వామి అయిన నవీన్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
‘బ్యాచిలర్ పార్టీ’ సినిమాలో వాడిన ‘న్యాయ ఎల్లీడు..’, ‘గాలిమాతు..’ పాటలను రక్షిత్ శెట్టి ఎలాంటి అనుమతి తీసుకోకుండా అక్రమంగా వాడుకున్నారని తెలిపారు. కాపీరైట్ మరియు ప్రసార హక్కులను కొనుగోలు చేయకుండా పాటలను ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఈ సినిమా విడుదల సయయంలో సాంగ్స్ రైట్స్ కోసం చర్చలు జరిగాయి కానీ విఫలయమ్యాయి. చర్చలు కూడా ముందుకు సాగలేదు. దీనిపై తాజాగా నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పరమవ స్టూడియోస్, నటుడు రక్షిత్ శెట్టిపై కేసు నమోదైంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నటుడు రక్షిత్ శెట్టికి యశ్వంత్‌పూర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వెంటనే విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. రక్షిత్ ప్రస్తుతం రిచర్డ్ ఆంటోనీ: ద లార్డ్ ఆఫ్ సీ అనే మూవీ చేస్తున్నాడు. ఇది 2014లో వచ్చిన ఉలిదవరు కాదంటే సినిమాకు ప్రీక్వెల్. ఈ మూవీకి ఆయనే దర్శకుడు.