Venkateswarlu
Venkateswarlu
రవీందర్ చంద్రశేఖరన్.. మీడియాను.. సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యే వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరిది. ప్రముఖ తమిళ సీరియల్ నటి మహాలక్ష్మితో రెండో పెళ్లి తర్వాత ఆయన పేరు దేశ వ్యాప్తంగా సుపరిచితమైంది. వీరి పెళ్లి అప్పట్లో పెద్ద చర్చకే దారి తీసింది. కోలీవుడ్‌లో నిర్మాతగా ఉన్న రవీందర్‌ను మహాలక్ష్మి డబ్బుకోసమే పెళ్లి చేసుకుందన్న ప్రచారం మొదలైంది. ఈ ప్రచారాలపై ఆమె క్లారిటీ ఇచ్చినా ఏం లాభం లేకపోయింది. ఆ తర్వాత వీరి పెళ్లి గురించి చాలా పుకార్లే వచ్చాయి. కానీ, అవన్నీ ఒట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి.
అలా ఎప్పుడూ ఏదో ఒక విధంగా వార్తలో ఉండే రవీందర్.. మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే, ఈసారి ఆయన ఓ కేసులో ఇరుక్కున్నారు. అది కూడా ఓ చీటింగ్ కేసులో.. తన దగ్గర డబ్బులు తీసుకుని, రవీందర్ మోసం చేశాడంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసుల సమాచారం ప్రకారం.. అమెరికాలో ఉంటున్న విజయ్ అనే వ్యక్తి రవీందర్‌తో కలిసి ఓ సినిమా నిర్మాణంలో భాగమయ్యాడు. సినిమాతో మంచి లాభాలు వస్తాయని రవీందర్.. విజయ్‌కి చెప్పాడు. దీంతో విజయ్ తన వాటాగా 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అయితే, సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా రవీందర్‌నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
విజయ్ ఎంత అడిగినా రవీందర్ 15 లక్షల విషయంలో నిమ్మకు నీరెత్తిన వాడిలా ఉండిపోయాడు. దీంతో విజయ్ చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్‌ను ఆశ్రయించారు. ఆన్‌లైన్ ద్వారా రవీందర్‌పై కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రవీందర్‌ను తాజాగా, విచారణకు పిలిపించారు. విచారణకు హాజరైన రవీందర్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం విచారణ నడుస్తోంది. మరి, రవీందర్ చీటింగ్ కేసులో ఇరుక్కోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.