iDreamPost
android-app
ios-app

వివాదంలో రఘువరన్ నటి.. కేసు నమోదు.. ఏం జరిగిందంటే

  • Published Apr 02, 2024 | 12:01 PM Updated Updated Apr 02, 2024 | 12:01 PM

Saranya Ponvannan: ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు తరచుగా ఏదో వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో రఘువరన్ బీటెక్ సినిమా నటి చేరారు. అసలేం జరిగిందంటే

Saranya Ponvannan: ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు తరచుగా ఏదో వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో రఘువరన్ బీటెక్ సినిమా నటి చేరారు. అసలేం జరిగిందంటే

  • Published Apr 02, 2024 | 12:01 PMUpdated Apr 02, 2024 | 12:01 PM
వివాదంలో రఘువరన్ నటి.. కేసు నమోదు.. ఏం జరిగిందంటే

సినిమా సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న అంశం వెలుగులోకి వచ్చినా అది పెద్ధ సెన్సెషన్ అవుతుంది. సమాజంపై వారి ప్రభావం బాగా ఉంటుంది.. అభిమానులు వారిని ఆదర్శంగా తీసుకుంటారు కనుక.. సెలబ్రిటీలు ఏం చేసినా.. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే ముందు కూడా ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే వివాదాల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. తాజాగా ఓ సీనియర్ నటి మీద కేసు నమోదయ్యింది. అసలేం జరిగింది అంటే..

కోలీవుడ్‌ సీనియర్ నటి శరణ్య పొన్వన్నన్ పై కేసు నమోదయ్యింది. ఆమె ఎవరు అనుకుంటున్నారా.. ధనుశ్ నటించిన చిత్రం రఘువరన్‌ బీటెక్ సినిమాలో అతడి తల్లి పాత్రలో నటించింది కదా ఆమెనే శరణ్య. అనేక టాలీవుడ్ సినిమాల్లో కూడా కనిపించింది. కానీ రఘువరన్ సినిమాతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో కొడుకు కోసం ఆరాటపడే అమాయకపు తల్లి పాత్రలో నటించి.. అందరిని ఆకట్టుకుంది. టాలీవుడ్ లో కూడా ఎక్కువగా తల్లి పాత్రల్లోనే నటించింది శరణ్య. ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఓ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

చెన్నైలో శరణ్య నివాసముండే విరుంగబాక్కంలో పార్కింగ్‌ గొడవ ఏకంగా పోలీస్‌ స్టేషన్‌ వరకు తీసుకెళ్లింది. పార్కింగ్ విషయంలో పొరుగింటి వారితో వివాదం తలెత్తింది. దీంతో పక్కింటి వారు శరణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను నటి తమను బెదిరించిందని పేర్కొంటూ శ్రీదేవి అనే మహిళ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దాంతో పోలీసులు శరణ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక శరణ్య రఘువరన్‌ బీటెక్‌తో పాటు 24, వేదం, గ్యాంగ్‌ లీడర్, మహాసముద్రం, ఖుషి లాంటి సినిమాల్లోనూ కనిపించారు.

గతంలో టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి కూడా పార్కింగ్ వివాదంలో చిక్కుకుని.. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదంలో ఓ ఐపిఎస్ అధికారితో డింపుల్ గొడవ పడింది. ఈ క్రమంలో ఐపీఎస్‌ అధికారి వాహనాన్ని కాలితో తన్నడం మాత్రమే కాక దుర్బాషలాడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Jojobet GirişmeritbetjojobetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swapholiganbet giriş