iDreamPost
android-app
ios-app

Captain Miller OTT Release: OTTలోకి వచ్చేస్తోన్న కెప్టెన్ మిల్లర్.. ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే..?

సంక్రాంతి బరిలోకి దిగి.. హయ్యెస్ట్ కలెక్షన్లను రాబట్టుకున్న మూవీగా నిలిచిన తమిళ చిత్రం కెప్టెన్ మిల్లర్. తమిళనాట మంచి వసూళ్లను సాధించిన ఈ చిత్రం నెల రోజులు తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇంతకు ఎప్పుడంటే..?

సంక్రాంతి బరిలోకి దిగి.. హయ్యెస్ట్ కలెక్షన్లను రాబట్టుకున్న మూవీగా నిలిచిన తమిళ చిత్రం కెప్టెన్ మిల్లర్. తమిళనాట మంచి వసూళ్లను సాధించిన ఈ చిత్రం నెల రోజులు తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇంతకు ఎప్పుడంటే..?

Captain Miller OTT Release: OTTలోకి వచ్చేస్తోన్న కెప్టెన్ మిల్లర్.. ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే..?

ధనుష్-అరుణ్ మాతేశ్వరన్ కాంబోలో వచ్చిన కోలీవుడ్ మూవీ కెప్టెన్ మిల్లర్. తమిళంలో సంక్రాంతి బరిలోకి దిగిన ఈ మూవీ.. తెలుగులో కాస్త ఆలస్యంగా జనవరి 26న విడుదలైంది. కాగా, తమిళనాట మిశ్రమ స్పందన రాగా, ఇక్కడ డిజాస్టర్‌గా నిలిచింది. రూ. 70 కోట్ల బడ్జెట్‌తో మూవీగా తెరకెక్కగా.. రూ. 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది. అయితే తెలుగులో మాత్రం కేవలం రెండు కోట్ల రూపాయలు కూడా వసూళ్లు చేయలేకపోయింది. తెలుగు నేటివిటీ మిస్ కావడం, సరైన ప్రమోషన్లు చేయకపోవడంతో.. ఈ సినిమాను పట్టించుకోలేదు తెలుగు ఆడియన్స్. సందీప్ కిషన్, శివ రాజ్ కుమార్ వంటి స్టార్స్ నటించారు. ప్రియాంక అరుళ్ మోహన్, మాళవికా సతీషన్ కీలక పాత్రలు పోషించారు.

కథ, ధనుష్ యాక్టింగ్ బాగున్నా.. సందీప్ కిషన్, శివ రాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్నా సినిమాకు రావాల్సినంత హైప్ అయితే రాలేదు. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీకి వచ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. జనవరి 12న థియేటరలలో విడుదల ఈ మూవీ నెల రోజుల తిరక్కుండానే వచ్చేస్తోంది. ఫిబ్రవరి 9న నెట్ ఫ్లిక్స్‌లో కెప్టెన్ మిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో అఫీషియల్ ఎనౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక కథ విషయానికి వస్తే.. అగ్నీశ్వర అలియాస్ అగ్ని (ధనుష్) ఊరిలో కుల వివక్షను భరించలేక..బ్రిటీష్ ఆర్మీలో సైనికుడిగా చేరుతాడు. అక్కడి వెళ్లాక.. అతడి పేరు కెప్టెన్ మిల్లర్ అవుతుంది. అక్కడ నుండి పారిపోయి దొంగగా మారతాడు. ధనుష్ ఊరిలో ఉన్న విలువైన విగ్రహాన్ని బ్రిటీషర్లు తమ దేశానికి తరలిస్తుంటే.. వారి వద్ద నుండి ఆ విగ్రహాన్ని కొట్టేస్తాడు. అసలు అతడు ఎందుకు దొంగగా మారాడు..? తన ఊరిలోని విగ్రహాన్ని బ్రిటీషర్లు తీసుకెళుతుంటే..అతడు ఎందుకు దొంగతనం చేశాడు.. అనేది తెరపై చూడాల్సిందే. ఇక ధనుష్ ప్రసత్తుం శేఖర్ కమ్ములతో సినిమా ఓకే చేశాడు. ఇందులో నాగార్జున కూడా నటిస్తోన్న సంగతి విదితమే.